గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ, జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసారు. పట్టిసీమ నీళ్ళు వదిలిన నేపధ్యంలో, పోలవరం రైట్ మెయిన్ కెనాల్ కోసం, తన నియోజకవర్గంలో భూములు ఇచ్చిన రైతులను ఆదుకోవాలని కోరారు. గత మూడేళ్ళుగా చంద్రబాబు ప్రభుత్వం వారిని ఆదుకున్న విషయాన్ని ప్రస్తావించారు. పట్టిసీమ మొదలైన నేపధ్యంలో, వారి పోలాలకు పట్టిసీమ నీళ్ళ కోసం 500 మోటార్లు ఏర్పాటు చేసామని, ప్రతి సారి చేస్తున్నామని చెప్పారు. దీని కోసం, ప్రతి సారి ప్రభుత్వం మోటార్లకు ఉచిత విద్యుత్ ఇస్తూ వచ్చిందని, ఇప్పుడు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరారు. 500 మోటార్లు వల్లభనేని వంశీ తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

అయితే ప్రస్తుతం అధికారులు అక్కడ కరెంట్ ఇవ్వటానికి సిద్ధంగా లేరు అని తెలియటంతో, వంశీ, జగన్ కు లేఖ రాసారు. ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని విద్యుత్‌ అధికారులను ఆదేశించాలన్నారు. 2014కి ముందు వరకు, అక్కడ రైతుల భూమి ఇవ్వకపోవటంతో, రైట్‌ మెయిన్‌ కెనాల్‌ పనులు నిలిచిపోయాయన విషయాన్ని గుర్తు చేసారు. అయితే పట్టిసీమ ప్రాజెక్ట్ కోసమని, చంద్రబాబు సుచనతో, రైతులు పెట్టిన కేసులు వెనక్కు తీసుకోవటంతో, పట్టిసీమ ప్రవాహం కృష్ణా నదికి చేరిందని, కృష్ణా డెల్టాను కాపాడామని వల్లభనేని వంశీ చెప్పారు. మరి ఈ విషయం పై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికే పట్టిసీమ లేట్ అవ్వటంతో, డెల్టా రైతులు అల్లాడిపోతున్నారు. రెండు రోజుల క్రితం, పట్టిసీమ ప్రవాహం ప్రారంభమయ్యింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read