వల్లభనేని వంశీ గురించి టిడిపి వాళ్లు చెప్పేది ఒకే ఒక్క మాట. ఆయన రాజకీయ వ్యభిచారి అని. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాటలు ఇదే తీరుగ ఉంది. తాను టిడిపిలో గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా వైసీపీలో తిరుగుతూ టిడిపిని తిడుతూనే ఉన్నాడు. ఇది నైతికత అని చెబుతుంటాడు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా టిడిపి పంచుమర్తి అనూరాధకి ఓటేయాలని విప్ జారీ చేసినా, లెక్క చేయకుండా వైసీపీ అభ్యర్థికి ఓటేశాడు. ఇది కూడా నీతివంతమైన వ్యవహారశైలి అనే అంటున్నాడు. వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను పక్కనబెట్టి అదే నియోజకవర్గాల్లో సమన్వయకర్తల పేరుతో వేరే వాళ్లకి పెద్దరికం అప్పగించడంతో కడుపు మండిన వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపి అభ్యర్థికి ఓటేయడం మాత్రం వల్లభనేని వంశీ దృష్టిలో నమ్మకద్రోహం అట. తిన్నింటి వాసాలు లెక్కపెట్టటం అట. దీనినే వల్లభనేని వంశీ చేస్తే సంసారం, వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తే వ్యభిచారం అన్న చందంగా ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరినీ కోట్లు ఇచ్చి చంద్రబాబు కొనుగోలు చేశారట. వల్లభనేని వంశీతోపాటు టిడిపి నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం వైఎస్ జగన్ రెడ్డి తేజోవంతమైన ఫేస్ కట్ నచ్చి, రూపాయి తీసుకోకుండా నీతిబద్ధంగా వైసీపికి ఓటేశారట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోడ్ ద్వారా వ్యతిరేకంగా ఓటు వేసిన వారిని గుర్తించేశారని చెప్పిన వంశీ, టిడిపి నుంచి గెలిచి వైసీపీకి ఓటేసిన తమని ఏం చేయాలో చెప్పలేదు మరి. వైసీపీ దూరం పెట్టిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకే ఓటు వేయాలట. టీడీపీ నుంచి దూరంగా ఉన్న తాము నలుగురు మాత్రం టిడిపికి ఓటు వేయాల్సిన అవసరం లేదనడం వంశీ చేస్తే సంసారం, వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తే వ్యభిచారం అన్న చందంగా ఉందని రాజకీయ సర్కిళ్లలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
జగన్ ని గట్టిగా ఇరికించిన వల్లభనేని వంశీ..
Advertisements