హైదరాబాద్‌లో ఆస్తులున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలను నామినేషన్‌ వేయొద్దని టీఆర్‌ఎస్‌ నేతలు బెదిరిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ బెదిరింపుల కారణంగానే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇద్దరు పార్టీ టికెట్‌ కేటాయించినా ప్రచారం ప్రారంభించకుండా చడీచప్పుడు లేకుండా కూర్చున్నారని అంటున్నారు. నామినేషన్‌ దాఖలు పైనా భిన్నమైన సంకేతాలు పంపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఆ ఎమ్మెల్యేలకు ఉన్న ఆస్తులను అధికారాన్ని అడ్డం పెట్టుకొని వివాదాస్పదం చేశారని ఆరోపిస్తున్నారు. ఇద్దరిలో కృష్ణా జిల్లాలో విజయవాడ సమీపంలోని ఎమ్మెల్యే ఒకరు కాగా, రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మరొకరు! స్థానికంగా బలమైన నాయకులే. పార్టీ టికెట్లు ఇచ్చింది. గెలుపు ఖాయం! వీరిద్దరికీ హైదరాబాద్‌లో విలువైన ఆస్తులు ఉన్నాయని, ఎప్పుడో రెండు దశాబ్దాల కింద కొన్నారని చెబుతున్నారు.

madhav 20032019

కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండగా, ఆ ఎమ్మెల్యే మాత్రం దిగాలుగా ఇంట్లో కూర్చున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. కర్నూలు జిల్లా టీడీపీ నేతకు హైదరాబాద్‌లో బాగా ఖరీదైన ప్రాంతంలో ఒక కన్వెన్షన్‌ సెంటర్‌ ఉంది. దానిపై భారీగా పెట్టుబడి పెట్టారు. మంచి ఆదాయాన్ని ఇస్తోంది. ఇటీవల ‘నిబంధనల ఉల్లంఘన’ పేరిట కన్వెన్షన్‌ సెంటర్‌కు నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఆయన ఆందోళనకు గురయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. ‘‘విలువైన ఆస్తుల విషయంలో సమస్యలు తెచ్చుకోవద్దు. టీడీపీని వదిలిపెట్టి వైసీపీలో చేరితే మంచిది’’ అని తెలంగాణ ముఖ్య నేతలు సలహా ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అవతలిపక్షం ఆడుతున్న ‘మైండ్‌ గేమ్‌’ చంద్రబాబు దృష్టికి వచ్చిందని, ఇద్దరు నేతలను పిలిపించుకుని మాట్లాడారని చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ‘‘తెలంగాణ సీఎం కేసీఆర్‌ మనవాళ్ల ఆర్థిక మూలాలపై దాడులు చేస్తున్నారు. వైసీపీకి సరెండర్‌ కమ్మని వేధిస్తున్నారు.

madhav 20032019

ఏమనుకుంటున్నారు వీళ్లు..? ఇది రాజకీయమా..? ఇదా నీతి? ఇది ధర్మమా..? దీనికి సమాధానం చెప్పకుండా మాపై దాడులు చేయిస్తున్నారు’’ అన్నారు. అలిపిరి దాడిలో తనను చంపేందుకు ప్రయత్నించిన వారిలో వైఎస్‌ వివేకా హత్య కేసులో అనుమానితుడైన గంగిరెడ్డి కూడా ఉన్నట్లు చంద్రబాబు ఆరోపించారు. ‘‘మోదీ, జగన్‌, కేసీఆర్‌ ముగ్గురు ఒకటై మనకు అన్యాయం చేస్తున్నారు. వారి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందామా.. వారికి వదిలేసి ఊడిగం చేద్దామా..?’’ అని ప్రశ్నించారు. పోలవరం కట్టడానికి వీలులేదని కేసీఆర్‌ ప్రభుత్వం రిట్‌ పిటీషన్‌ వేసింది. ఎందుకు వేశారని నేను అడుగుతున్నా?’’అని ప్రశ్నించారు. ఇది ఇలా ఉంటే, ఆ కృష్ణా జిల్లా నేత, గన్నవరం తాజా మాజీ ఎమ్మల్యే వల్లభనేని వంశీ అనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఆ బెదిరింపులకు లొంగని వంశీ, చంద్రబాబు ఇచ్చిన అభయంతో, మరింతగా దూసుకెళ్ళి, గన్నవరం చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి జన సందోహం మధ్య నామినేషన్ వేసి, కేసీఆర్ కు ధీటుగా బదులిచ్చారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read