ఒక పక్క ప్రతిపక్ష పార్టీ ఎమ్మల్యేలు అసెంబ్లీకి రాకుండా ఇంట్లో ఉంటుంటే, అధికార పార్టీ సభ్యులే ప్రతిపక్ష పాత్ర కూడా అసెంబ్లీలో పోషిస్తున్నారు... ఇవాళ అసెంబ్లీలో, గన్నవరం ఎమ్మల్యే వంశీ, పెనమలూరు ఎమ్మల్యే బోడె ప్రసాద్, ఒకింత కటువుగానే, ప్రభుత్వాన్ని నిలదీశారు... సమస్య తీవ్రత తెలుస్కున్న ప్రభుత్వం, వెంటనే స్పందించింది.... సంక్రాంతిలోపే మొదలు పెడతామని, సంబధిత మంత్రి హామీ ఇవ్వటంతో, నియోజకవర్గ ప్రజలు కూడా, సంతోషం వ్యక్తం చేస్తున్నారు... వివరాల్లోకి వెళ్తే...
విజయవాడకు అతి దగ్గర్లో ఉన్న రామవరప్పాడు గ్రామ ప్రజలు వంతెన సరిగ్గా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వంశీ లేవనెత్తారు... ఈ గ్రామంలో ఇప్పుడు 30వేల జనాభా ఉందని వంతెన సరిగ్గా లేకపోవడంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రూ. 6 కోట్లకు వంతెనను ప్రతిపాదన చేశారని వంశీ తెలిపారు.
అయితే అధికారులు మాత్రం పట్టించుకోకుండా సాగదీస్తున్నారు అని, ఇదేంటని అధికారులను ప్రశ్నిస్తే ఎస్టిమేట్ పెంచాలి, రివైన్ చేయాలని చెబుతున్నారు. అయితే పక్క నియోజకవర్గాల్లో ఇలా వంతెనలు నిర్మించాల్సి వస్తే వీటినేం పట్టించుకోకుండానే నిర్మించేశారని వంశీ చెప్పుకొచ్చారు. దీంతో మంత్రి దేవినేని ఉమా స్పందిస్తూ, సంక్రాంతి పండుగ లేపు విజయవాడ దగ్గర్లోని రామవరప్పాడు గ్రామానికి వెళ్లే వంతెనకు శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు... అలాగే బోడె ప్రసాద్ లేవనెత్తిన వంతెన నిర్మాణం కూడా అదే సమయంలో చేపడతామని చెప్పారు.. డిసెంబర్‌లో టెండర్లు పూర్తి చేసి జనవరిలో శంకుస్థాపన చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ బ్రిడ్జి నిర్మాణాలను సర్కార్ చాలెంజ్‌గా తీసుకుని జూన్ లోపే నిర్మాణం పూర్తి చేసి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు....