అసలు వంశీ ఏ పార్టీలో చేరుతారో, ఆయన అనుచరులుకే తెలియని పరిస్థితి ఏర్పడింది. దీపావళి రోజున చంద్రబాబుకు వాట్స్ అప్ మెసేజ్ పంపించి, తాను పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని, అలాగే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నాను అని చెప్పారు. తన పై, తన అనుచరుల పై విపరీతమైన ఒత్తిడి ఉందని, వైసిపీ అరాచకాలు తట్టుకోలేక పోతున్నానని, రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకున్నాను అని, అలా అయినా తన పై ఒత్తిడి తగ్గుతుందని, వంశీ, చంద్రబాబుకి మెసేజ్ పెట్టటం, దానికి చంద్రబాబు పోరాడదాం అని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తరువాత, వంశీ తన అనుచరులకు ఫోన్ చేసి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చెయ్యాలని, మనం వైసిపీలో చేరుతున్నాం అని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టే, కొంత మంది వంశీ అనుచరులు, వైసీపీ రంగులు, జగన బొమ్మలు, వంశీ బొమ్మలతో, సోషల్ మీడియాలో పోస్టర్లు, వీడియోలు తయారు చేసి హడావిడి చేసారు.

vamsi 12112019 2

దీపావళి అవ్వగానే, వంశీ వైసీపీలో చేరిపోతారని, వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు వంశీ తన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపలేదు. మరో పక్క వంశీని అసెంబ్లీ కమిటిల్లో ఒక పదవి కూడా ఇచ్చారు. ఇవన్నీ చూస్తున్న వారికి అసలు వంశీ పార్టీ మారుతున్నారా లేదా ? లేక టిడిపి లోనే ఉంటారా ? లేక రాజకీయ సన్యాసం తీసుకుంటారా అనే విషయం పై క్లారిటీ లేకుండా పోయింది. అయితే, ఈ గందరగోళం పై వంశీ ఒక ప్రముఖ పత్రికతో మాట్లాడి, తన అభిప్రాయాన్ని చెప్పారు. నేను వైసిపీలో చేరాలి అనుకున్నాను, దానికి ముహర్తం ఎప్పుడు అనేది త్వరలోనే తెలుస్తుంది, ఒత్తిడులు నుంచి తన అనుచరలును కాపాడుకోవటానికి, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను అని వంశీ చెప్పారు.

vamsi 12112019 3

పదవిలో ఉండే సేవ చెయ్యాలి అని, సన్నిహితుల ఒత్తిడితోనే, రాజీనామా విషయంలో వెనక్కు తగ్గాను అని వంశీ చెప్పారు. వైసిపీలో చేరే సమయానికి రాజీనామా చెయ్యలా వద్దా అనే చర్చ రాలేదు, సమయం వచ్చినప్పుడు దాని పై చర్చిస్తాం అని వంశీ చెప్పారు. గతంలో టిడిపి హయంలో ఉన్నా, పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నా తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని వంశీ చెప్పారు. అంటే వంశీ చెప్పిన దాని ప్రకారం, ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యరు. అలా అని వైసీపీలో చేరరు. టిడిపికి అనుకూలంగా ఉండరు. తటస్థ ఎమ్మెల్యేలాగా కొనసాగాలని వంశీ నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది. మరి, ఇది ఎంత వరకు సాధ్యం ? వంశీ కనుక వైసిపీతో సన్నిహితంగా ఉంటే, టిడిపి అనర్హత వెయ్యమని కోరుతుంది కదా ? చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుందో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read