టీడీపీ నేత వల్లభనేని వంశీని తెలంగాణ పోలీసులు వెంబడించారు. కోర్టు జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్‌తో ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. వివరాల్లోకెళితే.. 2009 సమయంలో ప్రభుత్వం తనకు రక్షణ ఇవ్వడం లేదంటూ వంశీ ప్రైవేటు భద్రత సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఇంట్లో ఆయుధాలు దొరికాయంటూ ఆయుధాల చట్టం కింద వంశీపై కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసును కొట్టివేయాలని 2013లో హైకోర్టులో వంశీ క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. వంశీ అభ్యర్థనను పరిశీలించిన హైకోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్‌తో పాటు కేసును కూడా కొట్టేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఆయన ఇప్పటి వరకు కోర్టుకు హాజరుకాలేదు.

vamsi 03042019

తాజాగా దీనిపై దృష్టిసారించిన తెలంగాణ పోలీసులు.. వంశీ కోర్టుకు హాజరుకావడం లేదంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ మేరకు నాంపల్లి కోర్టు వంశీకి నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. దీంతో ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నించారు. ఇదిలాఉండగా, రాజకీయ కక్షతోనే తెలంగాణ పోలీసులు పిటిషన్ వేశారంటూ వంశీ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ వేసే రోజు కూడా, వంశీని కేసీఆర్ బెదిరించారు అనే వార్తలు వచ్చాయి. ‘‘విలువైన ఆస్తుల విషయంలో సమస్యలు తెచ్చుకోవద్దు. టీడీపీని వదిలిపెట్టి వైసీపీలో చేరితే మంచిది’’ అని తెలంగాణ ముఖ్య నేతలు సలహా ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే వంశీ మాత్రం ముందుకు వెళ్లారు. దీంతో ఇప్పుడు మళ్ళీ వంశీని వెంటాడుతున్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read