కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు- టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్ మధ్య వివాదానికి ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడేట్లు లేదు. ఇప్పటికే యార్లగడ్డకు లేఖ రాసి.. పలు ఇంటర్వ్యూల్లో ఈ వ్యవహారం వల్లభనేని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు వైసీపీ అభ్యర్థి సైతం మీడియాతో మాట్లాడుతూ ఈ వివాదం గురించి మాట్లాడారు. అయితే తాజాగా వంశీ మరోసారి యార్లగడ్డకు లేఖ రాశారు. ఈ లేఖతో గన్నవరంలో మరోసారి వైసీపీ వర్సెస్ టీడీపీ అయ్యే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల యార్లగడ్డ వెంకట్రావు.. వంశీపై పెట్టిన మీడియా సమావేశానికి ప్రతిస్పందనగా ఈ లేఖ రాశారు.

vamsi 16052019

వంశీ లేఖ యథావిథిగా... "ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పేందుకు మీ ఇంటికొస్తానన్న ఇన్ని రోజుల నుంచి నేను నగరంలో లేకపోవడం వల్లే నేను నువ్వు పెట్టిన విలేకర్ల సమావేశంపై స్పందించలేకపోయాను. గన్నవరాన్ని అమెరికాలోని డల్లాస్ నగరంలో పోల్చడం చాలా అభినందనీయం. అందుకే నిన్ను అభినందించడానికే మీ ఇంటికొద్దామని అనుకున్నా. ఓదార్పు యాత్ర చేస్తోన్న సమయంలో ప్రజలను ముద్దాడుతూ వారి ఆశీస్సులు కోరుతూ చేసిన యాత్ర భారతదేశంలో ఎవ్వరు చేయలేదు. గవర్నమెంట్ జీవో ద్వారానే బ్రహ్మలింగం చెరువును పూడిక తీశాం. గన్నవరంలోని బ్రహ్మలింగం చెరువు పూడికతీయడానికి రూ150 కోట్ల నిధులు అవసరం.. చెరువులో పూడికతీసిన మట్టిని రవాణా చేసేందుకు ఖర్చు చాలా అవుతుంది. దీనిపై మీకేమైన అభ్యంతరాలుంటే ఎఫ్.ఐ.ఏ ద్వారా లేదా సీ.బీ.ఐ ద్వారా దర్యాప్తుచేయించుకోవచ్చు. ప్రభుత్వం మీద ఎటువంటి భారం పడకుండా బ్రహ్మలింగం చెరువులో పూడిక తీసిన మట్టిని జాతీయ రహదారుల నిర్మాణానికి, ఎయిర్ పోర్ట్‌లో రన్‌వే విస్తరణ కోసం ఉపయోగించాము. దీనివల్ల సర్కార్‌కు ఎటువంటి నష్టం వాటిల్లలేదు. ప్రభుత్వానికి అనుకున్నదాని కంటే ఆదాయం సమకూరింది. నువ్వ అన్నమాటలకు కట్టుబడి ఉంటావని నేను నమ్ముతున్నాను. నువ్వు అన్న మాటలను ఎప్పుడూ యూటర్న్ తీసుకోవద్దు" అని వంశీ లేఖలో పేర్కొన్నారు.

vamsi 16052019

"ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని కుమారుడిగా నా వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కించపరుచుకోలేదు. నాపై తప్పుడు కేసులు బనాయించి నన్ను ఇరుకునపెట్టి అరెస్ట్ చేయించాలని చూస్తున్నావ్. పోలీసులు ఈ పని చేస్తారని నువ్వు అనుకుంటున్నావా..?. నువ్వు ఒకటి స్పష్టం చేయాలి.. వరకట్న వేధింపుల కేసు నీపై నమోదైందా లేదా..? నీ సతీమణి నా మాటలు విని నీపై కేసు పెట్టిందని నువ్వు నమ్ముతున్నావా..? అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నావ్..? ఏదన్న మాట్లాడే ముందు ఒక్కసారి క్రెడిబులిటినీ సరిచూసుకో. నీకు సంబంధించిన వ్యక్తిగత అంశాలు, కేసులపై మరోసారి మాట్లాడాలని నేననుకోవడం లేదు. నేను నా భార్యను కలిసి వైఎస్ జగన్‌ను బెంగళూరులో కలిశానని నువ్వు చెప్పడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికైనా గన్నవరంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పుతావని నేను ఆశిస్తున్నా. విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసే ముందు నీవు నాకు ఒకసారి ఫోన్ కాల్ చేసి ఉంటే బాగుండేది" అని వంశీ లేఖలో పేర్కొన్నారు. కాగా.. ఈ లేఖపై వైసీపీ నేతలు.. యార్లగడ్డ వెంకట్రావు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

 

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read