ఏపీలో కొత్తగా మరో నాలుగు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్‌‌కు సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ బాధ్యతలను అప్పగించారు. ఇక గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌ను సంగీత, నృత్య అకాడమీ ఛైర్మన్‌గా నియమించారు. జానపద కళలు, సృజనాత్మకత (ఫోక్ అండ్ క్రియేటివ్) అకాడమీ ఛైర్మన్‌గా పొట్లూరి హరికృష్ణను నియమించారు. ఏపీ స్టేట్ క్రిస్టియన్ (మైనారిటీస్) ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మద్దిరాల జోసెఫ్ ఇమాన్యుయేల్‌ను నియమించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

vademaatram 09012019

సీఎం చంద్రబాబు ఇటీవలే కొన్ని కార్పొరేషన్లకు ఛైర్మన్లను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ తాజాగా మరో నాలుగు కొర్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించారు. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వందేమాతరం శ్రీనివాస్‌కు ఏపీ సీఎం కీలక పదవి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ పార్టీ కోసం వందేమాతరం శ్రీనివాస్ పాడిన ‘తరలుదాం రండి మనం జన్మభూమికి..’ అంటూ సాగే పాట విశేష ఆదరణ పొందిన విషయం తెలిసిందే.

vademaatram 09012019

అటు ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2018 విజేత ఆచార్య కొలకలూరి ఇనాక్‌కు సమున్నత గౌరవం కల్పించారు. ఆయన రాసిన ‘విమర్శిని’కి 2018కి గాను ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. తెలుగు సాహిత్యంపై విమర్శకు సంబంధించి ఇనాక్ ఈ పుస్తకాన్ని రాశఆరు. జనవరి 29న ఢిల్లీలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఏటా 24 భాషల్లోని సాహిత్య రచనలను పరిశీలించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను అందిస్తారు. ఇనాక్ గతంలో ఎస్వీ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌గా సేవలు అందించారు. ఆయన రాసిన ‘అనంత జీవనం’కు ప్రతిష్టాత్మక మూర్తిదేవి అవార్డు లభించింది. తెలుగులో ఇనాక్ అనేక నవలలు రాశారు. అందులో ‘ఊరబావి’ ప్రధానమైంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read