వంగవీటి రాధా గగన్‌మెన్లవిషయం పై హైడ్రామా కొనసాగుతుంది. రాధాపై ప్రత్యుర్ధులు రెక్కి నిర్వహించారనే సమాచారంతో పోలీసులు అ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సందర్భంలో ప్రభుత్వం రాధా భద్రత కోసం 2+2 గన్ మెన్లను కేటాయించినట్లు ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించింన ప్రకారమే నిన్న రాధా కార్యాలయానికి ఒక గన్ మెన్ చేరుకున్నారు. నిన్న ఉదయం ఆ గన్ మెన్ చేరుకున్నప్పటికి కూడా రాధా వేరే పనుల్లో బిజీగా ఉండటం వల్ల సాయంత్రం వరకు కూడా తన కార్యాలయానికి చేరుకోలేదు. ఈ నేపధ్యంలో నిన్న సాయంత్రం కార్యాలయానికి చేరుకున్న తరువాత తనకు ఎటువంటి గన్ మెన్ అవసరం లేదని గన్ మెన్ ని తిప్పి పంపించేసారు. అయితే రాధా గన్ మెన్లను తిప్పి పంపించినప్పటికి తిరిగి ఈ రోజు ఉదయం యధావిధిగా ఒక గన్ మెన్ కార్యాలయానికి చేరుకుని, అక్కడ తాను విధులు నిర్వహించటానికి వచ్చినట్టు రాధా సన్నిహితులుతో చెప్పారు. అయితే రాధా తనకు ప్రభుత్వం తరపు ఇచ్చే భద్రత అవసరంలేదని చెప్పను కదా మళ్ళి ఎందుకు వచ్చారని రాధా సన్నిహితులు కొంత మంది ఉన్నతాదికారులతో మాటలదినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం తాము ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే గన్ మెన్లను పంపించినట్టు తెలిపారు.

radha 29122021 2

అయితే ప్రభుత్వం మొదట 2+2 గన్ మెన్లను అని ప్రకటించింది. అయితే నిన్న గాని, ఈ రోజు గాని రాధా కార్యాలయానికి ఒకే గన్ మెన్ వచ్చారు. అంటే ప్రభుత్వం ప్రకటించింది ఒకటి, ఇక్కడ క్షేత్ర స్థాయిలో జరిగింది ఒకటి. దీనికి సంబంధించి కొంత మంది పోలీసు అధికారులతో మాట్లాడితే, రేపటి నుంచి ఇద్దరు గన్ మెన్లను పంపిస్తామని అన్నారు. మరి ఈ సెక్యూరిటీ అంశంలో రాధా ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. అదే విధంగా రాధాకి ఈ రోజు ఉదయం చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి, సెక్యూరిటీ తిరస్కరించటం సరి కాదని, థ్రెట్ ఉన్నప్పుడు భద్రత విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని రాధాకు హిత బోధ చేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి బాగోలేదు అని, రాష్ట్రంలో కుట్ర రాజకీయాలు నడుస్తున్నాయని, ఈ నేపధ్యంలో ఈ కుట్ర రాజకీయాల పై పార్టీ పరంగా పోరాటం చేద్దాం కానీ, భద్రత విషయంలో మాత్రం అశ్రద్ధ వద్దని రాధాకి జాగ్రత్తలు చెప్పారు. మరి ఈ అంశం పై రాధా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read