వచ్చే ఎన్నికలు వైసీపీకి జీవన్మరణ పోరాటం. ఇప్పటికే ఓటమి సంకేతాలు అందుతున్నాయి. సర్వేలు ఎదురుతన్నుతున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. జగన్ రెడ్డి కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కాపు కార్డుతో బీఆర్ఎస్ ఏపీ శాఖని దింపారు. కాపు ఓట్లు జనసేన, టిడిపి వైపు పోకుండా చీల్చే వ్యూహం పన్నారు. ఇది అంతగా వర్కవుట్ అయ్యేలా కనిపించకపోయేసరికి కాపు బ్రాండ్ వంగవీటిని టార్గెట్ చేశారు. వైసీపీ కోసం పనిచేసే ఐ ప్యాక్ బృందం ఆధ్వర్యంలో నడిచే ఫేక్ అక్కౌంట్లతో వంగవీటి రాధా పార్టీ మారుతున్నారనే ప్రచారాన్ని తీవ్రం చేశారు. అన్నీ జనసేన పేరుతో ఐ ప్యాక్ ఆధ్వర్యంలో ఉన్న ఫేక్ ఖాతాల నుంచి ఒకే రకమైన కంటెంట్ పోస్టు కావడంతో అందరిలోనూ అనుమానాలు తీవ్రం అయ్యాయి. దీనిపై వంగవీటి రాధా యువసేన స్పందించింది. రాధాపై కొందరు కావాలనే దుష్ప్రచారాలు చేస్తున్నారని, రాధా ప్రతిష్టను మసకబార్చాలని కొందరు కుయుక్తులు పన్నుతున్నారని, ఈ ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దు అని ప్రకటన విడుదల చేశారు. రాధా టిడిపిలోనే కొనసాగుతారని పదేపదే చెప్పాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. పదవుల కోసమో, ఇతర అవసరాల కోసం పార్టీలు మార్చే నైజం రాధాది కాదని తేల్చి చెప్పారు. కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులతో రాధా ప్రతిష్టను మంట కలపాలని చూసే వారి ప్రయత్నాలు ఎన్నటికీ ఫలించవని తేల్చి చెప్పేశారు.
వంగవీటి రాధాని మానసికంగా టార్గెట్ చేసిన వైసీపీ ?
Advertisements