తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ప్రచారానికి 14 వ తేదీన వెళ్లాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడెందుకు అక్కడికి వెళ్లడంలేదో సమాధానం చెప్పాలని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. "గౌరవముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నేనొక ప్రశ్నావళి సంధిస్తున్నాను. నా ప్రశ్నలపై ఆయన సమాధానం చెప్పినా సరే, లేకుంటే సీఎంవో సమాధానంచెప్పినా సరే, వాస్తవాలు మాత్రంప్రజలకు తెలియాలి. 14వతేదీన తిరుపతి ప్రచారానికి వెళతానన్న ముఖ్యమంత్రి క-రో-నా వ్యాప్తిస్తుందని తనప్రచారాన్ని వాయిదా వేసుకున్నట్లు, అన్నలారా...తమ్ములారా అంటూ ఒఖ లేఖరాశారని పత్రికలద్వారా తెలిసింది. ముఖ్యమంత్రి చెప్పిన ఆ కారణం తప్పని నేనంటున్నా. లేఖలో ముఖ్యమంత్రి చెప్పిన కారణం తప్పు. వివేకానం దరెడ్డి హ-త్య కే-సు-లో ముఖ్యమంత్రిని కలవడానికి 14వ తేదీన వస్తున్నామనిచెప్పి, ఎవరైనా సీబీఐ అధికారులు ఆయనతో మాట్లాడారా? మాకొచ్చిన సమాచారం ప్రకారం ఢిల్లీనుంచి సీబీఐ అధికారులు ముఖ్యమంత్రి కార్యా లయాన్ని సంప్రదించారని తెలిసింది. 14వతేదీన సీబీఐ బృందం ముఖ్యమంత్రిని కలవడానికి వస్తున్నదనే వార్త బయటకు వచ్చింది. అది నిజమో కాదో ముఖ్యమంత్రి గారే చెప్పాలి. నిజమూ..కాదూ అని సీఎంవో చెబుతుం దా..లేక ముఖ్యమంత్రి చెబుతారా? సీబీఐ వారు వస్తున్నారనే ముఖ్యమంత్రి తనతిరుపతి పర్యటన రద్దుచేసు కున్నారా? సీబీఐ వారు ముఖ్యమంత్రిని సంప్రదించారా ... వారుచెప్పినదానికి ఆయన సరే అన్నారా? మా కార్యాలయానికి వచ్చిన సమాచారం ప్రకారం ముఖ్య మంత్రిని విచారించడానికి వస్తున్నామని వారు చెప్పార నితెలిసింది.
తాడేపల్లి ప్యాలెస్ లో వారికి అందుబాటులో ఉండటానికే ముఖ్యమంత్రి తనతిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారా? లేక విచారణ కోసం ముఖ్యమంత్రిని పు లివెందులకు రమ్మన్నారా? వివేకా కేసు విచారణలో భాగంగా సీబీఐ ఇప్పుడు పులివెందులలో ఉంది. ముఖ్యమంత్రిని విచారించాలని, ఆయన వాంగ్మూలం రికార్డ్ చేయాలని సీబీఐ ఆయన్ని కోరిందా .? ముఖ్యమంత్రికి అనుకూలమైన సమయం చెప్పాల ని సీబీఐ సీఎంవోని కోరిందా? వీటన్నింటింపై సమాధా నంచెప్పాలని ముఖ్యమంత్రిని కోరుతున్నా. 14వతేదీన సీబీఐ వారు వస్తున్నారన్నది నిజమా? సీబీఐ డిపార్ట్ మెంట్ కు కూడా నేను విజ్ఞప్తిచేస్తున్నా. వివేకానందరెడ్డి కేసుదర్యాప్తు ఆరంభంలోనే ఒకదశకు వచ్చింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయగానే ఆ దశకు దుర్దశపట్టింది. తొలుత సీబీఐ అక్కడున్న పోలీస్అధికారులను సరైన విధంగా విచారణచేయాలి. వారికి లైడిటెక్టర్ పరీక్షలు చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. ఎవరైతే కుటుంబ సభ్యులు, జగన్మోహన్ రెడ్డి బంధువులున్నారో వారి పాత్రేమిటో, అక్కడున్న పోలీస్ అధికారులే తెలియచే స్తారు. ఆ దిశగా సీబీఐ ఏమైనాప్రయత్నంచేసిందా? జగన్మోహన్ రెడ్డి కుటుంబసభ్యులను నిజాయితీగా విచా రించారా? విచారణను సీబీఐకి అప్పగించింది హైకోర్ట్ కనుక, దానిపై సమీక్ష చేయాలి. 14వతేదీన ముఖ్యమంత్రిని విచారించడానికి సీబీఐ వారు ఆయనకార్యాలయానికి వస్తున్నారన్నది మాకు వచ్చిన సమాచారం. సీఎంవోకి, సీబీఐ వారు ఫోన్ చేశారో లేదో, సీఎంవో కార్యాలయమే చెప్పాలి. మేం కాదు. సీఎంవో లోని అధికారులు కూడా చాలా రహస్యం గా ఉంటున్నారు. వారు అధికారుల్లా ప్రవర్తించడంలేదు. పారదర్శకంగా వ్యవహరించాలి. ముఖ్యమంత్రేమీ సీబీఐ విచారణకు అతీతుడు కాడు.18ఏళ్లు ప్రధానిగా పనిచేసి న ఇందిరాగాంధీని ఒకసాధారణ కానిస్టేబుల్ లోపలికి నెట్టి గడియపెట్టాడు. అరెస్ట్ చేశాడు.