జగన్మోహన్‌రెడ్డి వ్యవహారశైలి ప్రతిపక్ష, స్వపక్షసభ్యులతోపాటు, ఆయన కుటుంబస భ్యులకు కూడా అర్థంకావడంలేదని, వి-వే-కా-నం-ద-రె-డ్డి హ-త్య జరిగినప్పుడు కుటుంబబంధాలకు విలువనిచ్చే మనిషిగా, భావోద్వేగంతో స్పందించిన జగన్, ఇప్పుడెందుకు ఆ హ-త్య-తో తనకేమీ సంబంధంలేనట్లుగా వ్యవహరిస్తున్నాడని టీడీపీ సీనియర్‌నేత, ఆపార్టీ పొలిట్‌బ్యూరోసభ్యులు వర్లరామయ్య ప్రశ్నించారు. బుధవారం ఆయన మంగళ గిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వి-వే-కా చ-ని-పో-యి-న-ప్పు-డు సీబీఐ విచారణకు డిమాండ్‌చేసిన జగన్, అధికారంలోకి వచ్చాక దానిగురించి ఎందుకు వదిలేశాడన్నారు. వి-వే-కా కుమార్తె సునీత తనతండ్రి హ-త్య-కే-సు పై తాజాగా హైకోర్టుని ఆశ్రయించారని, ఆమె తనపిటిషన్ (3945-2019)లో జగన్ వ్యవహార శైలిపై, ఏపీపోలీసుల పాత్రపై పలు సందేహాలు వెలిబుచ్చారని వర్ల తెలిపారు. గతంలో ఏపీపోలీసుల పనితీరుని తప్పుపట్టిన వ్యక్తి నేడు అదేపోలీసులతో చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నాడని కూడా ఆమె అభిప్రాయపడిందన్నారు. కేసు విచారణచేస్తున పోలీసుల దర్యాప్తుని రాష్ట్రప్రభుత్వం ప్రభావితం చేస్తోందని, ఏపీ సర్కారుప్రమేయం లేకుండా కేసు దర్యాప్తుని సీబీఐకి అప్పగించాలని సునీత తన పిటిషన్లో కోరారన్నారు. కేసువిచారణలో జగన్‌ప్రమేయాన్ని సునీత ఇష్టపడటంలేదన్న అభిప్రాయం ఆమెపిటిషన్లో స్పష్టమైందన్నారు.
సునీత పిటిషన్‌తో ఆందోళనకు గురైన జగన్, ఆఘమేఘాలపై హైదరాబాద్‌కు పయనమయ్యాడని, తనఅక్క (సునీత)ను కలిసి ఆమెవేసిన పిటిషన్ ఉపసంహరిం పచేసేందుకే ఆయన వెళ్లాడన్న అనుమానం ప్రజలందరిలోనూ ఉందన్నా రు. ఎవరిని కాపాడటానికి, ఎవరిని కేసునుంచి తప్పించడానికి జగన్, సునీతతో చర్చించడానికి వెళ్లాడనే అనుమానం రాష్ట్రవాసుల బుర్రలను తొలుస్తోందని వర్ల చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వి-వే-కా-హ-త్య కేసులో చంద్రబాబు ప్రమేయం ఉందని, రాష్ట్రపోలీసుల దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని చెబుతూ, కేసువిచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌చేస్తూ 22-03-2019న కోర్టులో జగన్మోహన్‌రెడ్డి పిటిషన్ వేశాడన్నారు. (హ-త్య-కే-సు-కు సంబంధించి పలుసందర్భాల్లో జగన్‌మాట్లాడిన వీడియోను విలేకరుల ఎదుట ప్రదర్శించారు) తరువాత ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రయ్యాక వి-వే-కా హ-త్య- కేసు పై జగన్ స్పందిస్తాడని పార్టీవారితోపాటు, కుటుంబసభ్యులందరూ ఎదురుచూశారని, వారందరికీ నిరాశే మిగిలిందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చి 8నెలలు గడిచినా కూడా ముఖ్యమంత్రి జగన్ వి-వే-కా-కే-సు విచారణను పట్టించుకోలేద న్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసువిచారణకు సిట్‌ను నియమించా రని, జగన్‌వచ్చాక మరోరెండు సిట్ బృందాలను నియమించారని, ఆయాబృందాల దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో కూడా ఇప్పటివరకు బయటకురాలేదన్నారు.
సునీత తాజాగా వేసిన పిటిషన్లో పలువురి అనుమానితుల పేర్లను వెల్లడించారని, కేసునిసీబీఐకి అప్పగిస్తే, ఎవరిని అరెస్ట్ చేస్తారని జగన్ భయపడుతున్నాడన్నారు. వి-వే-కా-హ-త్య-కే-సు-లో ఎవరు అరెస్టయితే జగన్‌కు ముప్పు ఉందో ఆయనే స్పష్టంచేయాలన్నారు. తమ్ముడు జగన్‌చేసిన మోసం అక్కకు (సునీతకు) ఇప్పుడు తెలిసొచ్చిందని, అందుకే ఆమెను హైకోర్టుని ఆశ్రయించిందని వర్ల తెలిపారు. వి-వే-కా-హ-త్య-కే-సు గురించి ప్రశ్నించినవారం దరికీ నోటీసులు ఇస్తామంటున్నారని, కోర్టుకి వెళ్లిన సునీతకు, వాస్తవాలు మాట్లాడిన తనకు కూడా నోటీసులు ఇస్తారా అని వర్ల నిలదీశారు. వి-వే-కా-హ-త్యకేసేమీ జగన్ కుటుంబసమస్యకాదని, అసలేం జరిగిందో తెలుసుకోవాలన్న అభిప్రాయం ప్రజలందరి లోనూ ఉందన్నారు. రాజులసొమ్ము రాళ్లపాలైనట్లుగా, జగన్‌ప్రభుత్వం ప్రజలసొమ్ముని రంగులపాలు చేసిందని, విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రామయ్య అభిప్రాయపడ్డారు. గతంలోకోర్టుకు వెళితే రోజుకి రూ.60లక్షలు అవుతాయన్న జగన్, సునీతను కలవడానికి హైదరాబాద్‌కు వెళ్లడంద్వారా రూ.కోటి20లక్షల ప్రజల సొమ్ముని వృథాచేశాడన్నారు. జగన్ ఇప్పటికైనా కేసువిచారణ చేపట్టాలని, సీబీఐకి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని, ఆయనలా చేయకుంటే, ఆయనపై పడినమచ్చ అలానే ఉండిపోతుందన్నారు. విశాఖవాల్తేర్ క్లబ్‌ను కాజేయడానికి ఇప్పటికే విజయసాయి తనప్రయత్నాలు ప్రారంభించాడన్నారు.