నిరాదరణకు గురైన వృద్దులు, వికలాంగులు, వితంతువులు, అనాధ మహిళలపై ౖ వైసీపీ ప్రభుత్వం ప్రతాపం చూపుతోందని టీడీపీ పొల్ట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మ్లాడుతూ.... జీవిత చరమాంకంలో కుటుంబ సభ్యుల ఆదరణ కోల్పోయిన వృద్దులకు, వికలాంగులు, వితంతువులు, అనాధ మహిళలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారి ఫించన్లు తొలగించటం దుర్మార్గం. రాష్ట్రంలో 7 లక్షల ఫించన్లు తొలగించారు. తాము ఎన్టీఆర్ హయాం నుంచి ఫించన్లు తీసుకుంటున్నామని, చంద్రబాబు వచ్చిన తర్వాత 200 నుంచి రూ. 2 వేలకు పెంచారు, కానీ జగన్ ఎన్నికలకు ముందు రూ. 3 వేల ఫించన్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఫించన్లు తొలగించి మా న్లో మ్టి క్టొారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిగిరా తిరిగింది ఫ్యాన్ పోయింది నాఫించన్ అంటూ మహిళలు నినదిస్తున్నారు. ఫించన్లు తొలగిస్తే వారు ఎలా బ్రతకాలి. వివిధ నిభందనలతో ఫించన్లు తొలగించి 7 లక్షల మందిని ముఖ్యమంత్రి జగన్ రోడ్డున పడేశారు.
వారికి అన్నం పెట్టే దిక్కెవరు, కోట్లకు పడగలెత్తిన జగన్ పేదల నోి కాడ కూడు లాగేయటం దుర్మార్గం. జగన్ వీరికి సమాధానం చెప్పకపోయినా ఒక రోజు దేవునికి సమాధానం చెప్పాలి. క్రమం తప్పకుండా చర్చికెళ్తానని చెప్తున్న జగన్... యేసు క్రీస్తు చూపించిన కరుణ, జాలి,దయలో కనీసం 1 శాతం కూడా చూపటం లేదు. పేదల పింఛన్లు అన్యాయంగా తొలగించారు. పింఛన్ల తొలగింపుపై ప్రభుత్వాన్ని పేదలు నిలదీస్తున్నారు.సీఎం జగన్ ఏం సమాధానం చెప్తారు. పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లులో మధురమీనాక్షి అనే 103 ఏళ్ల వృద్ధురాలి పింఛన్ తొలగించారు.ఆమెకు ఎన్టీఆర్ హయాం 1987 నుంచి వస్తున్న ఫించన్ ఇప్పుడు నిలిపివేశారు. ఆమె వయస్సు 3 సంత్సరాలుగా పడిందని చెప్పి ఆపేశారు. 2007లో తన భర్త చనిపోతే..భర్త బ్రతికే ఉన్నాడని మరో ముస్లిం వితంతు ఫించను ఆపేశారు. ఆమె తన భర్తను చూపించాలంటూ అధికారులను నిలదీసింది.పింఛన్ల తొలగింపుపై పౌరసరఫరాల శాఖ మంత్రి స్పందించమని వృద్దులు అడిగితే నీ యమ్మ మెగుడుకి ఇవ్వాలా ఫించన్ అంటారేమో అని భయపడుతున్నారు.
వికలాంగుల పింఛన్లు సైతం తొలగిస్తున్నారు. భీమిలిలో పింఛన్లు తొలగింపుపై మంత్రి అవంతి సమాధానం చెప్పాలి. టీడీపీలో ఉన్నపుడు నీతి కధలు చెప్పిన అవంతి వైసీపీలోకి చేరారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆయన ఆ పార్టీలో గద్దలా వాలుతారు. ఇలా పార్టీలు మారేవారిని ప్రజలు బియ్యంలో రాళ్లు వేరేసినట్లు వేరెయ్యాలి. ఫించన్ల తొలగింపుపై వారు ఎవరిని అడగాలి. తమ ఫించన్ల ఎందుకు తొలగించారని వారు ప్రశ్నిస్తే వారిపైన కూడా కేసులు పెడతారా? నేడు ఫించన్ల తొలగింపుపై టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా చేసిన ఆందోళనలకు ఫించన్ల కోల్సోయిన వారంతా తరలివచ్చారు. ఫించన్లు తొలగించిన వృద్దులను చూసి ఒక మహిళా ఎమ్మార్వో తానమే చేయలేనంటూ కంటతడి పెట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 ఏళ్లకే ఫించను ఇస్తామని ఇవ్వకుండా మోసం చేశారు. పేదల ఫించన్లు తొలగించి వారి ఉసురు పోసుకోవద్దు. రద్దు చేసిన 7 లక్షల ఫించన్లు తిరిగి ఇవ్వాలని వర్ల రామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.