జగన్మోహన్‌రెడ్డి అందరి ముఖ్యమంత్రుల్లాంటివాడు కాదని, సీబీఐ 11, ఈడీ5 ఛార్జ్‌షీట్లు వేశాయని, వేలకోట్ల ఆస్తుల్ని ఈడీఇప్పటికే జప్తుచేసిందని, ఆర్థికంగా జగన్‌ చేసిన నేరంచాలాపెద్దదని, ఆయన క్రమంతప్పకుండా హాజరుకావాలని కోర్టు స్పష్టంచేసిం దని టీడీపీ సీనియర్‌నేత, ఆపార్టీ పొలిట్‌బ్యూరోసభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు. కోర్టులన్నీ ముఖ్యమంత్రి వ్యవహారశైలి గురించి చెబుతుంటే, ఆయనేమో సుప్రీకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జాస్తిచలమేశ్వర్‌ని కలవడాన్ని తప్పుపడుతున్నామన్నారు. సుప్రీం న్యాయమూర్తులకే నీతిప్రబోధాలు చేసి, దేశన్యాయవ్యవస్థలోనే గొప్పపేరుప్రతిష్ఠలున్న చలమేశ్వర్‌గారు, సీబీఐ, ఈడీ ఛార్జ్‌షీట్లు మోపబడి, 11కేసుల్లో ముద్దాయిగా ఉన్నవ్యక్తిని కలవడం సభ్యసమాజానికి ఎలాంటిసంకేతాలు ఇస్తుందన్నారు. ముద్దాయిగా ఉన్న వ్యక్తిని, సుప్రీం మాజీన్యాయమూర్తి కలిస్తే, జగన్‌కేసులను విచారించే న్యాయమూర్తుల మెదళ్లలో ఎటువంటి ఆలోచనలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. ఏ కారణంతో సుప్రీం మాజీన్యాయమూర్తి జగన్‌ని కలిసినా, వారికలయిక సభ్యసమాజానికి వేరే సందేశం ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.

జగన్‌ సీబీఐకోర్టుకి, హైకోర్టుకి తిరుగుతున్నవేళ, జగన్‌, జాస్తిచలమేశ్వర్‌గార్ల కలయిక ఆయా న్యాయస్థానాల ను ప్రభావితం చేయదా అని వర్ల ప్రశ్నించారు. వారిమధ్యలో ఎంపీ, మాజీఎంపీకూడా ఉన్నారని, చలమేశ్వర్‌గారు జగన్‌ని కలిస్తే, ముద్దాయిగాఉన్న వ్యక్తి ఆకలయికను తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలు లేకపోలేదని వర్ల అభిప్రాయపడ్డారు. అసలు అటువంటి అవకాశం ఏ-1కు ఎందుకు కల్పించాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. జాస్తిచలమేశ్వర్‌గారు జగన్‌ని కలవడంలోని ఔచిత్యం ఏమిటో బహిరంగపరచాలన్నారు. ఏసమస్యపై వారిమధ్య ఎటువంటి చర్చ జరిగిందో, చెప్పనిపక్షంలో పరోక్షంగా జగన్‌కు సాయంచేయడానికే వెళ్లారని భావించాల్సి వస్తుందన్నారు. నిన్నటి మీకలయిక, జగన్‌తో కలిసి మీరుచూపిన హావభావాలు చూసినవారెవరైనా పలువిధాలుగా ఆలోచిస్తారన్నారు. న్యాయమూర్తిగా పనిచేసి, రిటైర్డ్‌ అయ్యాక కొంతకాలం పాటువారు న్యాయవాదులుగా కూడా పనిచేయరని, అలాంటిది ఆర్థికనేరగాడిగా దేశవ్యాప్తంగా పేరుప్రతిష్ఠలు పొందిన వ్యక్తిని ఎలా కలుస్తారని వర్ల నిలదీశారు.

జగన్‌ గతంలోకూడా చలమేశ్వర్‌గారిని కలిశాడని, అప్పుడు ఇంతలా హడావుడి చేయలేదని, ఇప్పుడెందుకు అలా జరిగిందన్నారు. జగన్మోహన్‌రెడ్డి తన కేసుల్లోంచి బయటపడటానికి జాస్తిచలమేశ్వర్‌ని కలిశాడో..లేక ప్రభుత్వానికి కోర్టుల నుంచిపడుతున్న మొట్టికాయల నుంచి తప్పించుకోవడానికి కలిశాడో ముఖ్యమంత్రే చెప్పాలన్నారు. వారిద్దరి కలయిక ప్రజలకు ఎటువంటి తప్పుడు సంకేతాలు ఇస్తుందో అర్థం చేసుకోవాలన్నారు. చలమేశ్వర్‌ అమరావతి తరలింపువల్ల నష్టపోతున్న రాష్ట్రప్రజల కు సాయంచేయడానికి జగన్‌ని కలిశారా..లేక ముఖ్యమంత్రికి సాయంచేయడానికి వెళ్లారా అనేది చెప్పాలన్నారు. జగన్‌కి సాయపడటానికే చలమేశ్వర్‌గారు ఆయన్ని కలిశారని, నిన్నటివరకు సుప్రీంన్యాయమూర్తిగా ఆయన అనుభవించినహోదానే జగన్‌కు ఉపయోగపడుతుందన్నారు.

వారిరువురూ ఏ అంశాలపై చర్చించారో ఇప్పటికై నా స్పష్టంచేయాలని, లేకుంటే ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతుందని రామయ్య స్పష్టంచేశారు. వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఏఏ కేసులపై, ఏఏ కోర్టులకు హాజరవు తున్నారో, ఆయా కేసుల్ని విచారించేన్యాయమూర్తులందరూ తమమస్తిష్కాల్లో జగన్‌, చలమేశ్వర్‌ల కలయికను నిలుపుకోకుండా తక్షణమే తొలగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న ట్లు వర్ల తెలిపారు. నిన్నటివరకు ఉన్నతస్థానంలో కొనసాగిన చలమేశ్వర్‌గారిలాంటి వారు, జగన్‌ని కలవడంవల్ల ఆయన తాను పొందాలనుకున్నది పొందారని, ఒక ముద్దాయిగా ఆయన తాననుకున్నది సాధించారని రామయ్య స్పష్టంచేశారు. చలమేశ్వర్‌ గారు ఇప్పటికైనా జగన్‌ను కలవడంపై, సవివరమైన ప్రకటనచేయాలన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read