తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రకాశం జిల్లాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారికి తక్కువ ఎక్స్ గ్రేషియా ఇవ్వటం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్ ప్రమాదంలో చనిపోయన వారికి, ప్రతి ఒక్కరికీ రూ. 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని వర్ల రామయ్య డిమాండ్ చేసారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో, విద్యుత్ షాక్ తగిలి, 9 మంది కూలీలు చనిపోయారని, వారంతా దళిత వర్గానికి చెందినవారని, వారి మృతికి తెలుగుదేశం పరి సంతాపం వ్యక్తం చేస్తుందని వర్ల రామయ్య అన్నారు. ప్రమాదం జరిగిన తరువాత, ప్రభుత్వం స్పందించిన తీరు అవమాకరంగా ఉందని అన్నారు. విశాఖలో జరిగిన ఘటనలో, అక్కడ చనిపోయినవారికి, ఒక్కొక్కరికీ కోటి రూపాయలు ఇచ్చారని, మా ముఖ్యమంత్రి ఎంతో దయా హృదయం కలవారు అంటూ, ప్రచారం చేసుకున్నారని, ప్రభుత్వమే చనిపోయిన వారికీ కోటి రూపాయలు ఇవ్వటంతో, ఇక నుంచి ప్రమాదం జరిగి ఎవరైనా మరణిస్తే ఇలాగే కోటి రూపాయలు ఇస్తారని అనుకున్నాం అని అన్నారు.
విశాఖలో స్పందించిన విధంగానే, ప్రకాశం జిల్లాలో చనిపోయిన వారికి కూడా కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటన చేస్తారని అందరూ అనుకున్నారని, కాని కేవలం 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, ప్రభుత్వం ఇలా స్పందించటం దారుణం అని అన్నారు. వారివి కోటి ప్రాణాలు, వీరివి 5 లక్షల ప్రాణాలా ? అని నిలదీశారు. చివరకు ప్రకాశం జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు కూడా, ప్రమాదం జరిగిన స్థలం వద్దకు వెళ్లలేదని, 9 మంది చనిపోతే ఇదేనా వ్యవహరించే తీరు అని అన్నారు. కేవలం అక్కడ స్థానిక ఎస్సై వచ్చారని, చనిపోయిన వారి పట్ల ఇంత వివక్ష ఎందుకు అని ప్రశ్నించారు. విశాఖలో పోటీ పడి నిద్రలు పోయి హంగామా చేసారు, ఇక్కడ కనీసం ఆ కుటుంబాలని పరామర్శించలేదని అన్నారు.
వైసీపీ ప్రభుత్వానికి దళితులు అంటే ఇంత చిన్న చుపా అని ప్రశ్నించారు. దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుని, వారితో అవసరం తీరిపో గానే ,వారితో వ్యవహరించే తీరు ఇదా అని రామయ్య ప్రశ్నించారు. చివరకు వీరి అందరినీ సాముహిక సమాధి చేసారు అంటే, ఈ ప్రభుత్వానికి దళితులు అంటే, ఎంత గౌరవం ఉందొ అర్ధం అవుతుందని అన్నారు. ఈ విషయాలు అన్నీ ఈ ముఖ్యమంత్రికి తెలుసా తెలియదా ? తెలియనట్టు నటిస్తున్నారా అని అన్నారు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో, అదేదో తన సొంత కంపెనీ అన్నట్టు జగన్ వ్యవహరించిన తీరు, ఇక్కడ మాత్రం కనీసం మంత్రులు కూడా వారిని పట్టించుకోకపోవటం చూస్తుంటే, దళితులు అంటే దిక్కులేని వారు అనే అలుసే కారణం అని అనంరు.