మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారంవర్ల రామయ్య విలేకరులతో మాట్లాడిన వివరాలు. యథాతథంగా ఆయన మాటల్లోనే మీకోసం...! "రాష్ట్రమంతా, అందరూకూడా, దేశమంతాకూడా మొన్న అయిపోయింది.. నిన్న అయిపోయి దని ఎదురచూస్తుంటే వాయిదాపడుతోంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, పాత్రికేయుల్ని సీబీఐని అడుగుతున్నా. అవినాశ్ రెడ్డిని అరెస్ట్ కాకుండా రక్షిస్తున్న ఆ అజ్ఞాత శక్తి ఎవరు? ఆ అజ్ఞాతశక్తి మనరాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డిగారే కదా! జగన్మోహన్ రెడ్డిగారి కి మనరాష్ట్రప్రజలు ఇచ్చిన మొత్తం అధికారాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు అడ్డగోలుగా సంపా దించిన తనఅవినీతి సంపాదన మొత్తాన్ని, తనతెలివితేటలు మొత్తాన్ని రాష్ట్రసంక్షేమం కోసం ఉపయోగిస్తున్నారు అని అనుకుంటున్నారా? లేక అల్లకల్లోలంగా మారిన రైతులజీవన విధా నాన్నిబాగుపర్చడానికి, నీళ్లలో తడిచిపోయిన పంట కొనడానికి ఏమైనా ఉపయోగిస్తున్నారా ? కాదు. తొలగించిన దళితసంక్షేమ పథకాలన్నీకూడా మరలాప్రవేశపెట్టడానికి ఉపయోగి స్తున్నాడా? లేదు. అతని ముందున్న ఏకైకలక్ష్యం తనసోదరుడు అవినాశ్ రెడ్డి అరెస్ట్ కాకుం డా చూడటమే. అతనే ఆ అజ్ఞాతశక్తి, అతను ఏంచేస్తున్నాడో తెలియదు..ఎలా చేస్తున్నాడో తెలియదు.. అతనితరుపున లాబీయిస్ట్ లు ఎలా ప్రయత్నంచేస్తున్నారో తెలియదు? ఇంకా అరెస్ట్ కాలేదనే మీమాంసమాత్రం రాష్ట్రప్రజల్లో ఉంది. నేను అడుగుతున్నాను ఈరోజున సీబీఐని అడుగుతున్నాను. మిమ్మల్ని తప్పుపట్టడం లేదు మిమ్మల్ని కూడా ఇబ్బందిపెట్టారు. సీబీఐ అధికారులపై తప్పుడుకేసులుపెట్టడం ఇక్క డే సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలోనే సాధ్యమైందిఅది. అందుకని మిమ్మల్ని తప్పుపట్టడంలేదు, కానీ ఎందుకుమీనమేషాలు లెక్కెడుతున్నారు? మీరు హైకోర్ట్ లో దేర్ ఈజ్ ఏ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ఎఫెక్ట్ ది అరెస్ట్ ఆఫ్ మిస్టర్ అవినాశ్ రెడ్డి అని అఫిడవిట్ వేయలా? వేశారా లేదా? సుప్రీంకోర్టుకు చెప్పలా? మీరు వదిలిస్తే మేం లోపలే స్తామని అన్నారా.. లేదా? మరి ఇంకెందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు?

నిన్ హైడ్రిన్ టెస్ట్ దేనికి చేస్తారు? ఫోరెన్సికల్ ల్యాబ్ లో ఫింగర్ ప్రింట్ ఎక్స్ పర్ట్స్ కు కూడా కనిపించని ఇన్ విజబుల్ ఫింగర్ ప్రింట్స్ కూడా కనుక్కునే, కనిపెట్టే అవకాశం ఉంటుంది. అందుకోసం ఆ టెస్ట్ చేస్తారు? దానికి అవినాశ్ రెడ్డి అరెస్ట్ కు సంబంధం ఏమిటి? మినాయిడ్రి న్ టెస్ట్ కు, అవినాశ్ రెడ్డి అరెస్ట్ కు సంబంధంలేదుకదా! తీసుకెళ్లి అతన్ని లోపలేయచ్చుకదా ! ఆ పనిచేయకుండా మీరుఎందుకు మీనమేషాలు లెక్కపెడుతున్నారు? మీకు అడ్డుపడు తున్న ఆశక్తి మనశక్తేనా? ఈ శక్తేనా? చాలా కాలాతీతమైంది. మీ ఎఫీషియన్సీని కూడా ప్రశ్నించేస్థాయిలో ప్రజలు ఉన్నారనికూడా సీబీఐ గమనించాలి. సీబీఐ డైరెక్టర్ ...నాక్కూడా వారి గురించి తెలుసు. తెలుగుదేశం పార్టీ మీ అఫిషియన్సీని తప్పుపట్టడంలేదు. వివేకా కూతురు డాక్టర్ సునీత ఓ వీరవనిత.చరిత్రలో రాణిరుద్రమ, ఝాన్సీరాణి పోరాటంచేసిన శత్రువులకంటే పెద్దశత్రువుతో సునీత చేస్తున్న పోరాటం చరిత్రలో నిలుస్తుంది. ఆ అమ్మాయి. డాక్టర్ సునీత, డాటర్ ఆఫ్ వివేకానందరెడ్డి. మనంచెబుతాం..ఝాన్సీ లక్ష్మీభాయి, రాణిరుద్రమదేవి..ఈ అమ్మాయి. రాణిరుద్రమదేవి, ఝాన్సీలక్ష్మీభాయిలు ఎదుర్కొన్న శత్రువులు జగన్మోహన్ రెడ్డి కంటే బలవంతులేమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు విశాల ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు. కాకతీయసామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్ కంటే పెద్దదేమీకాదు. పెద్దసువిశాల సామ్రాజ్యానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంత శక్తిమం తుణ్ణి ఢీకొంటున్న మహిళ ఆ అమ్మాయి. ఆ అమ్మాయి..వీరవనిత లేకపోతే పోలీసులు ఎప్పుడో ఈ కేసుని అన్ డిటెక్టబుల్ అనిచెప్పేవారు.

ఝాన్సీలక్ష్మిభాయి, రాణిరుద్రమ రక్తా న్ని పుణికిపుచ్చుకున్న ఆమె పోరాటపటిమ ఈకేసుని సజీవంగా ఉంచింది. మహిళలం దరూ కూడా ఆమెనుఆదర్శంగా తీసుకోవాలి. పెద్దడాక్టర్ అయిన ఆఅమ్మాయిని మండు టెండలో చున్నీని నెత్తికి కట్టుకొని పరిగెడుతుంటే, ఈ ప్రభుత్వానికి జాలి, దయ, కరుణ, మానవత్వంలేవా? ఆమె ఎవరోకాదే.. పరాయిమహిళకాదే, నీ సొంతచెల్లెలు. ఆకన్ను.. ఈకన్ను అన్నారు. ఒకకన్ను ఏమో ముద్దాయిని పట్టుకోమని తిరుగుతుంటే, మరోకన్ను ఏమో డోంట్ అరెస్ట్ మీ అన్నా.. అంటోంది. ఇప్పటికైనా సీబీఐ జంపింగ్ టూ యాక్షన్. టేక్ సూటబుల్ యాక్షన్. చట్టప్రకార మే యాక్షన్ తీసుకోండి. మీరు హైకోర్టులో, సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్ ప్రకారమే ముం దుకెళ్లండి. మీ విచారణ మీరుచేసుకోండి, మేంఎక్కడా అడ్డుపడం అని న్యాయస్థానాలు హుం దాగాచెప్పాయి. అంతస్పష్టంగా చెప్పాక కూడా మిమ్మల్ని అడ్డుకుంటున్నఆ అజ్ఞాతశక్తి ఎవరు? మీ చేతులుబందిస్తున్నది.. మీకాళ్లకు అడ్డుపడుతున్నది.. అతను అరెస్ట్ కాకుండా చూస్తున్న ఆ అజ్ఞాతశక్తి ఎవరో చెప్పండి, అంత శక్తి అడ్డుకున్నాక ఈ కేసు విచారణ మేం చేపట్టలేమని చెప్పండి పోనీ.

అవినాశ్ రెడ్డి అరెస్ట్ తోనే వివేకాహత్య కేసు ముగిసిపోయినట్టుకాదని సీబీఐ గుర్తించాలి. ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఇంకాఉంది. హూకిల్డ్ బాబాయ్ ఉదంతంలోని అసలు ముద్దాయిలు బయటకు రావాల్సి ఉంది. ఇంతటితోఅయిపోలేదు. అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయడంతోనే కేసుముగిసిపోయినట్టు కాదు. మీరు ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది చాలా ఉంది. కుట్ర బయటకు తీయాలికదా! హూ కిల్డ్ అనేది కొంతవరకు ఐడియా వచ్చింది. కానీ ఎందుకు చంపారనేది తేలాలికదా! ఎందుకు అనేది సీబీఐ దర్యాప్తుచేయాలి. సుప్రీంకోర్టు కూడా అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయగానే సీబీఐని వదలదు. అది మిలియన్ డాలర్ల క్వశ్చన్. వై దేహేవ్ కిల్డ్ హిమ్. అర్థరాత్రి, తెల్లవారుజామున వచ్చినఫోన్లు, కాల్ లిస్ట్ లుకూడా మీరువదిలేస్తే ప్రజలు వదలరు. ఎందుకంటే అవి ప్రజల మస్తిష్కంలో నిక్షిప్తమయ్యాయి. వాటిపై మీరు సమాధానంచెప్పాలి.. ఎవరు ఎందుకు చంపా రనేది సీబీఐనే బయటపెట్టాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read