ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎవరైనా ఎక్కడైనా అవినీతి చేస్తే, కాల్ చెయ్యండి అంటూ టోల్ ఫ్రీ నెంబర్ విడుదల చేసింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ 14400 అనే నెంబర్ ఏర్పాటు చేసారు. అయితే ఇది చంద్రబాబు 1100 కాన్సెప్ట్ కు, కాపీ. అయితే జగన్ గారు ఆ నెంబర్ తీసేసి, కొత్త నెంబర్ పెట్టరు. ఇది ఇలా ఉంటే, 14400 కు ఫోన్ చేస్తే, 15 రోజుల్లోగా, సమస్య పరిష్కరించాలని, ఇందులో ఒక రూల్. అయితే తెలుగుదేశం నేత వర్ల రామయ్య, ఆ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసారు. జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి సియంగా ఉండగా చేసిన, అక్రమార్జనపై అధ్యయనం చేయాలని ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ హయంలో జరిగిన దోపిడీ పై విచారణ చెయ్యాలని, ఈ ఫిర్యాదును స్పెషల్ ది గా భావించి, సచివాలయానికి తీసుకెళ్లి అధికారులకు ఇవ్వాలని కాల్ సెంటర్ సిబ్బంది ఆయనకు సూచించారు. తన ఫిర్యాదు పై 15 రోజుల్లో చర్యలు తీసుకోవాలని, మళ్ళీ 15 రోజుల తరువాత ఫోన్ చేస్తానని వర్ల రామయ్య అన్నారు. అయితే, కాల్ సెంటర్ సిబ్బంది మాత్రం, ఏమి చెయ్యాలో తెలియక అవాక్కయ్యారు.
ఇక మరో పక్క బొత్సా వ్యాఖ్యల పై కూడా తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెందిన రాజధాని ప్రాంతాన్ని శ్మశానంతో పోల్చిన మంత్రి బొత్స సత్యనారాయణను మంత్రివర్గం నుంచి బర్త్‌రఫ్ చేయాలని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. మంగళవారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాయలంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సైబరాబాద్‌లా అమరావతిని నిర్మించాలని చంద్రబాబు నాయుడు గారు సంకల్పించారు. రాజధానిలో 35 లక్షల మందికి శాశ్వత నివాసం, 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలని భావించారు. రాజధాని నుండి వచ్చిన ఆదాయంతో 13 జిల్లాలు అభివృద్ధి జరుగుతుంది. సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చు. రాజధానిలో 9 నగరాలు నిర్మించాలని 60 శాతం పనులు పూర్తి చేశారు. కానీ వైసీపీ నేతలు రాజధానిపై ఇష్టం వచ్చినట్లు దుష్రచారం చేస్తున్నారు. రాజధానిపై వైసీపీ నేతలు నక్క పురాణం చెప్పారు. రాజధాని ముంపుకు గురవుతుందని, వరద వస్తుందని, ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అవినీతి జరిగిందని రకరకాల ఆరోపణలు చేశారు. కానీ ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. రాజధానిని బొత్స శ్మశానంగా వర్ణించడం సిగ్గుచేటు. 25 రోజుల్లో 33 వేల ఎకరాలు రైతులచ్చిన ప్రాంతాన్ని శ్మశానంతో పోలుస్తారా? 29 గ్రామాల ప్రజలు నివిసిస్తున్న ప్రాంతాన్ని శ్మశానం అంటారా? రాజధానిలో ఇప్పటికే హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలు జరిగాయి.
వాటిని శ్మశానంతో పోలుస్తారా? గతంలో హైమావతి, భ్రమరావతి అంటూ అవమానించారు. ఇప్పుడు ఏకంగా శ్మశానం అంటూ కించపరుస్తున్నారు. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గం నుండి బర్త్‌రఫ్ చేయాలి. లేకుంటే బొత్స వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి వ్యాఖ్యలుగా పరిగణించాల్సి వస్తుంది. రాష్ట్రంలో మంత్రులు, స్పీకర్, ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు వింటుంటే.. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారా లేక బూతుల మీడియం ప్రవేశపెట్టారా అనే అనుమానం కలుగుతోంది. మంత్రులు నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడుతున్నారు. విద్యారుల్ని, నిరుద్యోగుల్ని ఒక మంత్రి కుక్కలతో పశువులు పోల్చారు. తన నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో స్సీకర్ మహిళలలను అవమానపరిచేలా మాట్లాడతారా? రాజ్యాంగబద్దమైన, బాధ్యతాయుతమైన స్సీకర్ ఇలాగేనా మాట్లాడేది.? వైసీపీ నేతల నుండి బూతు పురాణం తప్ప ఒక్కటైనా మంచిమాట వచ్చిందా.? ఈ మంత్రుల వ్యవహారశైలి చూసి ప్రజలు ఇది మంత్రివర్గం కాదు, 'కంత్రి'వర్గం అనుకుంటున్నారు. బొత్సను వెంటనే బర్త్ రప్ చేయాలి, స్పీకర్ మహిళలకు క్షమాపణ చెప్పాలి. మంత్రులు, స్పీకర్ ఈవిధంగా బూతులు మాట్లాడుతుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారు. విని ఎంజాయ్ చేస్తున్నారా? లేక ఆయనే ఇలా మాట్లాడిస్తున్నారా? బొత్స వెంటనే సస్సెండ్ చేసి తన పరిపాలన విధానాన్ని నిరూపించుకోవాలని అనురాధ అన్నారు.