సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యవహారం పై విజయవాడ పోలీసులు స్పందించారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న కారణంగా విజయవాడలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ మరియు సెక్షన్ 144 అమలులో ఉన్నాయని, అందుకే బహిరంగ ప్రదేశాలో ఎలాంటి సమావేశాలు, సభలకు అనుమతి లేదని విజయవాడ పోలీసులు స్పష్టం చేశారు. ఒకవేళ సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలంటే ముందస్తు అనుమతులు తప్పనిసరి అని తేల్చి చెప్పారు. అంతేకాకుండా రాం గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై తలపెట్టిన ప్రెస్‌మీట్ కార్యక్రమానికి ఎంచుకున్న ప్రదేశం పైపుల రోడ్ నిత్యం హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలతో రద్దీగా ఉంటుందని, అత్యవసర సర్వీసులకు ఆటంకం ఏర్పడే ప్రమాదముందని పోలీసులు తెలిపారు.
ఆయన ప్రెస్‌మీట్ వల్ల రెండు వర్గాల మధ్య ఘర్షణ సైతం తలెత్తే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన నిర్వహించాలని తలపెట్టిన కార్యక్రమం బహిరంగ ప్రదేశం కావున, ఎవరినైనా కించపరిచే వ్యాఖ్యలు చేస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగి ఆస్తి, ప్రాణ నష్టం జరిగే అవకాశముందని అందుకే రాం గోపాల్ వర్మ ప్రెస్ మీట్‌కు అనుమతిని నిరాకరించినట్లు విజయవాడ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. రామ్ గోపాల్ వర్మ. ఈ మధ్యకాలంలో ఆయన నిర్మించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాపై పలు వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను తెలంగాణలో విడుదల చేసినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్‌లో కోర్టు ఆదేశాల నేపథ్యంలో వాయిదా వేశారు.
చివరకు లైన్ క్లియర్ కావడంతో మే 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా విడుదల చేయనున్నామని ప్రకటించారు వర్మ. ఈ మేరకు నేడు విజయవాడలోని ఓ హోటల్‌లో ప్రెస్‌మీట్ పెట్టాలని నిర్ణయించారు. అయితే తీరా సమయానికి హోటల్ యాజమాన్యం అనుమతి నిరాకరించడంతో నడి రోడ్డుపైనే ప్రెస్‌మీట్ పెట్టబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో అలెర్ట్ అయిన పోలీస్ యంత్రాంగం శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే కారణంగా రామ్ గోపాల్ వర్మను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ హైదరాబాద్ సినిమా బ్యాచ్ మొత్తానికి, ఇదే సరైన ట్రీట్మెంట్ అంటూ ఏపి ప్రజలు అంటున్నారు. అక్కడ ఉండి, మన ప్రాంతం పై విషం చిమ్మి, ఇప్పుడు ఇక్కడకు వచ్చి ప్రశాంత చెడగొట్టే ఇలాంటి వారిని తరిమేయ్యాలని ప్రజలు అంటున్నారు...