రెండు రోజుల క్రిందట జగన్ మోహన్ రెడ్డి, నేను పెద్ద స్వాతి ముత్యం, మా పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ చిన్న స్వాతి ముత్యాలు, చంద్రబాబు దుర్మార్గుడు అంటూ, చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద దుమారాన్ని రేపాయో తెలిసిందే. చంద్రబాబు తన కులపు పోలీసు వాళ్ళని పెట్టుకుని, మ్యానేజ్ చేసి, ఎన్నికలకు వెళ్తున్నారు అంటూ హడావిడి చేసిన తరువాత రోజే, వాళ్ళ పార్టీ నేతలే, పోలీసులకు కట్టలు కట్టలు డబ్బుల కవర్లు పంపిస్తూ అడ్డంగా దొరికిపోయారు. జగన్ చెప్పిన కబురులు, ఇంకా ప్రజల చేవిల్లో తిరుగుతూ ఉండగానే, వాళ్ళ పార్టీ నేతలే పోలీసులకు డబ్బులు ఇస్తూ, దొరికిపోయి, వాళ్ళ నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నారు.
ఎన్నికలకు ముందే మైలవరం నియోజకవర్గంలో లంచాల కలకలం రేగింది. డబ్బులున్న కవర్లతో వైసీపీ నేతలు పోలీస్‌స్టేషన్లకు వెళ్లారు. మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్లకు వైసీపీ నేత మాగంటి వెంకటరామారావు కవర్లతో వెళ్లారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ఉండాలని రామారావు డబ్బు కవర్లు ఇవ్వబోయారు. వైసీపీ అభ్యర్థి వసంతకృష్ణప్రసాద్‌కు అనుకూలంగా వ్యవహరించాలని కోరారు. దీంతో సీఐ, ఎస్సైలు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్నపోలీస్ అధికారులు సీసీటీవీ ఫుటేజీని సేకరించారు.
కవర్లు తీసుకుని వచ్చిన రామారావుపై పోలీసులు ఐపీసీలోని 448, 109 ఎన్నికల నేరం 171 కింద కేసు నమోదు చేశారు. మధ్యాహ్నం వరకు కేసులు నమోదు చేయకపోవడంతో పోలీసులపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజీ సేకరించి వైసీపీ నేతలపై అధికారులు కేసులు నమోదు చేశారు. అయితే ఇది కేవలం ఎన్నికలు మ్యానేజ్ చేయ్యటానికా లేక, కొన్ని నెలల క్రిందట వసంత నాగేశ్వరరావు మాట్లాడిన మాటలు గురించా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. కొన్ని నెలల క్రిందట, "ఆ ఉమా గాడి సంగతి చూడమని జగన్ చెప్పాడు, కడప నుంచి రౌడీలను దించుతాం" అంటూ వైసిపీ నేత, మాజీ హోంమంత్రి ఫోన్ సంభాషణ బయట పడిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇప్పుడు, ఇవన్నీ చూస్తుంటే, ఎదో పెద్ద కుట్ర పన్నారు అనిపిస్తుంది... పోలీసులు ఎటువంటి ఆక్షన్ తీసుకుంటారో చూద్దాం...