వైసీపీ నేత వసంత నాగేశ్వరరావు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును కడప నుంచి రౌడీలను తెచ్చి మర్డర్ చేసి పడేస్తా అంటూ, గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసి బెదిరించిన ఆడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన టెలీకాన్ఫరెస్ లో అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో ఈ విషయం చర్చకు వచ్చింది. దీనిపై చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు. ఓ మంత్రిని హత్య చేస్తామనే ధోరణిలో వ్యాఖ్యానించడం తీవ్రమైన విషయమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా చంద్రబాబు ప్రస్తావించారు.
ఈ విషయం పై మాజీ మంత్రి, వైసీపీ నేత వసంత నాగేశ్వరరావు, వైసిపీ స్టైల్ లో స్పందించారు. 24 గంటలు తరువాత విజయసాయి రెడ్డి పంపించిన స్క్రిప్ట్ చెప్పారు. గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శిని బెదిరించలేదుదని, కేవలం మందలించానంతే అని ఆయన చెప్పుకోచ్చారు. మంత్రి ఉమా మహేశ్వరరావు అనుచరులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నట్టు తన అనుచరులు చెప్పారని, దీంతో వైసీపీ జెండాలు ఎందుకు తొలగిస్తున్నారని మాత్రమే అడిగానని తాను ఎవరిని బెదిరించాలేదని స్పష్టం చేశారు.
ఆయన్ని చంపుతా అని కాని, కడప నుంచి రౌడీలు వస్తారు అని కాని అనలేదని అన్నారు. తనకు, తన పార్టీ అధినేతకు హింస అనే మాటే తెలియదని అన్నారు. తన మాటలను అమరావతిలో కూర్చుని, కుట్రతో రికార్డు చేయించి, ఎడిట్ చేశారని మాజీ మంత్రి ఆరోపించారు. నా ఎదుగుదల చూసి, మా జగన్ ముఖ్యమంత్రి అయిపోతారని తెలుసుకుని, ఇలా చేస్తున్నారని అన్నారు. తనపై ఇలాంటి ఆరోపణలు రావడం సిగ్గుగా ఉందని, ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ, ఏ అధికారినీ దుర్భాషలాడలేదని అని పేర్కొన్నారు. తాను చంద్రబాబు, కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు, ఏడేళ్లు పనిచేశానని, తన మీద ఆ మాత్రం నమ్మకం అని ఆవేదన వ్యక్తం చేశారు.