జగన్ మోహన్ రెడ్డి 151 సీట్లతో గెలిచారే కాని, ఆయనకు ఉన్న అవగాహనారాహిత్యం, దూకుడు స్వాభావం, ఆలోచన లేకుండా, కక్షతో చేసే పనులతో, గత 11 నెలలుగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ప్రతి రోజు ఏదో ఒక ఇబ్బంది కాని, లేదా కోర్ట్ లో మొట్టికాయలు కాని, స్వయం తప్పిదాలు కాని, పరువు పోవటం కాని, ఇలా ఏ రోజు కూల్ గా వెళ్ళిపోయిన రోజు లేదు అని చెప్పాలి. స్వయంగా చేసుకున్న పనులే ఇందుకు కారణం. అయితే ఎక్కడ తప్పుడు జరిగిందో తెలుసుకునే మనస్తత్వం జగన్ ది కాదు. తప్పు జరిగింది అని కూడా ఒప్పుకోరు. అందుకే ఎవరో తెలిసిన స్వమజీ చెప్తేనో, లేక ఎవరు చెప్పారో కాని, జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మార్పులు చేసారు. జగన్ కు సన్నిహితంగా ఉన్న స్వామి, ఈ సలహా ఇచ్చినట్టు టాక్ నడుస్తుంది. జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కూర్చుని, రివ్యూలు, ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు. ఆయన కూర్చునే కుర్చీ వెనుక ఉన్న, ధర్మ చక్రం వల్లే, జగన్ కు ఇన్ని ఇబ్బందులు అని, అది మార్చేద్దాం అని సలహా ఇచ్చారు అంట.
అంతే రాత్రికి రాత్రి, దాన్ని పీకి పడేసారు. ఆ ధర్మ చక్రం స్థానంలో, ఏపి రాష్ట్ర ఎంబ్లెమ్ వచ్చింది. అలాగే మరికొన్ని వాస్తు విషయానికి సంబంధించి, కొన్ని పనులు జరిగాయని చెప్తున్నారు. నిజానికి అమరావతి రాజధాని అయిన తరువాత, అమరావతి విశిష్టత ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశంతో, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇది పెట్టించారు. ఆయన దాని ముందు కూర్చుంటే ఎంతో హుందాగా ఉండేది. అయితే తరువాత కొత్త ఇల్లు కట్టించుకున్న జగన్, అధికారంలోకి రాగానే, అదే డిజైన్ ని, తన క్యాంప్ కార్యాలయంలో పెట్టించుకున్నారు. మరి ఏమైందో ఏమో కాని, ఇప్పుడు అది తీసేశారు. ముఖ్యంగా అమరావతి అంటే జగన్ కు ఇష్టం లేదని, అందుకే వైజాగ్ వెళ్తున్నారని, అందుకే అమరావతి ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారని అంటున్నారు.
అయితే, అది కాదని, వాస్తు పరంగా, అది చాలా ఇబ్బంది అని, అందుకే చంద్రబాబు కూడా ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు జగన్ కూడా అదే ఇబ్బంది పడుతున్నారని, అది తీసేస్తే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని, జగన్ కు అంతా మంచి జరుగుతుంది అని సలహా ఇచ్చిన మేరకు, మొన్న రాత్రి ఆ ధర్మ చక్రం తీసేసారు. నిన్న జగన్ రివ్యూ మీటింగ్ కు వెళ్ళిన వారు, అది చూసి, అవాక్కయ్యారు. తరువాత విషయం తెలుసుకున్నారు. ఇంకేముంది, నిన్నటి నుంచి జగన్ కు అంతా మంచే అనుకున్నారు. అయితే నిన్న ఉదయం, 11 గంటలకు, తెలుగు మీడియం తీసేసి, ఇంగ్లీష్ మీడియం తెచ్చిన జీవో కోర్ట్ రద్దు చేసింది. సాయంత్రానికి, 11 జిల్లాలను కేంద్ర హాట్ స్పాట్లు ప్రకటించింది. అంటే ఇప్పుడప్పుడే ఎన్నికలు ఉండవు. ఇక రాత్రికి నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రెస్ నోట్ రిలీజ్ చేసి, విజయసాయి రాసిన లేఖకు కౌంటర్ ఇవ్వటంతో, పరువు పోయింది. మొత్తంగా, ఆ ధర్మచక్రం మార్చిన తరువాత కూడా జగన్ కు కలిసిరాలేదు అనే చెప్పాలి. మరి ఈ సారి ఏమి మార్పులు చేస్తారో.