హాయ్ ఐ యాం దేవ్.. ఐ డోంట్ నో తెలుగు.. ఐ వర్క్డ విత్ ఇంటర్నేషనల్ పార్టీస్... జనసేనని ఒక ఊపు ఊపటానికి వచ్చా... నా టాలెంట్ అంతా బయటకు తీస్తా... చూపిస్తా... చూపిస్తా... ఈ మాటలు చెప్పింది ఎవరో తెలుసా ? దేవ్ అంటూ, జనసేన పార్టీకి సలహాదారుడుగా పని చేసిన వ్యక్తి... ఆ రోజు ఇవన్నీ చూసి, విని, అవును అనుకుంటా, పవన్ చాలా గట్టి వాడిని తీసుకొచ్చాడు... దేవ్ లో ఆ కాన్ఫిడెన్సు చూడండి, ఇక విజయం మనదే అంటూ, జనసేన పార్టీ డ్రీం మిషన్ ఎక్కింది... సీన్ కట్ చేస్తే, 24 గంటల్లో మొత్తం మారిపోయింది... దేవ్ కాదు...వాసు దేవ్...వ్యూహ కర్త కాదు..కార్య కర్త... ఇంగ్లీష్ వాడు కాదు..తెలుగు వాడు... మీరనుకొన్న ఈ దేవ్ మామూలు వాడు కాదు ... పూర్తి పేరు వాసుదేవ్... హైదరాబాద్ చింతలబస్తీ కుర్రాడు.. మోడీ పంపిన మన కిషన్ రెడ్డి మనిషి. తెలుగు రాదు అన్నాడు ఎందుకంటే...మాట్లాడితే తెలిసిపోతుందిగా తెలంగాణ వాడని..
ఈ చింతలబస్తీ దేవ్ ను తీసుకోవచ్చి, ఇంటర్నేషనల్ ప్రొఫైల్ ఉన్నట్టు బిల్డ్ అప్ ఇచ్చాడు పవన్.. మనం చేసే పనులు ఎవరికీ తెలియవు అనుకుంటే అది అజ్ఞానమే... చింతలబస్తీ నుంచి వచ్చినా, చికాగో నుంచి వచ్చినా, అది వేరే విషయం.. ఎవరి పార్టీలు వారివి... వీళ్ళకు దమ్ము లేదు కాబట్టి సలహాదారులని పెట్టుకుంటారు... ఇది ఎవరికీ అభ్యంతరం కాదు... కాని, ఇక్కడ ఆడుతున్న అతి పెద్ద ఆట చూస్తుంటే, రాష్ట్రం ఏమైపోతుందో అని భయం వేస్తుంది... మొన్నా ఆ మధ్య, పవన్ ట్విట్టర్ వార్ మొదలు పెట్టిన ఏప్రిల్ 20 తారీఖు, రెండు మూడు రోజుల ముందు, పవన్, కిషన్ రెడ్డి ఇంట్లో సమావేశం అయ్యారు అనే ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది...
ఇప్పుడు అదే కిషన్ రెడ్డి మనిషి, పవన్ కళ్యాణ్ సలహాదారుడు అయ్యాడు... ఇవన్నీ చూస్తుంటే ఆపరేషన్ గరుడ నిజమే అని నమ్మాల్సి వస్తుంది... ఒక పక్క మోడీకి పర్సనల్ గా పని చేసిన వ్యక్తి, జగన్ సలహాదారుడు అయ్యాడు.. అదే ప్రశాంత్ కిషోర్... ఇప్పుడు బీజేపీ పార్టీకి పని చేస్తూ, బీజేపీ పార్టీలో ఉన్న మనిషి, ఇప్పుడు పవన్ దగ్గర చేరాడు... పవన్ రాజకీయం మొత్తం నేనే నడిపిస్తా అంటున్నాడు... అంటే ఏంటి ఇది ? బీజేపీ చెప్పినట్టు, జనసేన, వైసిపీ నడవాలి... ఆపరేషన్ గరుడ పాత్రధారులు వీరంతా... అక్కడ బీజేపీ ఏమి చెప్తే, వీరంతా అది చేస్తారు... ఇది విషయం... ఇలాంటి రాజకీయం నడుస్తుంది మన రాష్ట్రంలో.. చంద్రబాబు అనే ఒక్కడిని ఎదుర్కోవటానికి, ఇంత మంది వస్తున్నారు... వీళ్ళకు దమ్ము లేదని తెలుసు, వీలకు సలహాదారులని కూడా, నియమిస్తున్నారు బీజేపీ పెద్దలు...