ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ప్రసాద్ రెడ్డిని సెలవు పై వెళ్ళాలని ప్రభుత్వం ఆదేశించినట్టు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల పై, ఈ చర్యలు తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా విశాఖపట్నంలో జరుగుతున్న జీవీఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా, రెడ్డి కులం సదస్సు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ సమావేశానికి విజయసాయి రెడ్డి హాజరు అయ్యారు. అయితే ఇలాంటి రాజకీయ సమావేశం, అందులోనూ రెడ్డి కుల సమావేశంలో, ఆంధ్రా యూనివర్సిటీ లాంటి ఒక ప్రముఖ యూనివర్సిటీ వైస్ చాన్సెలర్ పాల్గునటంతో అందరూ అవాక్కయ్యారు. అయితే ఆ సమావేశంలోనే ఓట్లుకు సంబంధించి అభ్యర్దించటం, కులాల ప్రస్తావన రావటం, ఒక పార్టీని తిట్టటం, మరో పార్టీని పొగడటం, ఇలా ఒక పార్టీ సమావేశానికి, ఒక యూనివర్సిటీ వైస్ చాన్సెలర్ హోదాలో ఉన్నవారు, హాజరు కాకూడదు అని కూడా నిబంధన ఉంది. అలాగే దీనికి సంబంధించి సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. రాజకీయ పార్టీ సమావేశాలు కానీ, లేదంటే ఏదైనా కులాలకు సంబందించిన సమావేశాలు కానీ, మతాలకు సంబందించిన అంశాల్లో పాల్గునకూడదు అనే నిబంధనలు ఉన్నాయి. దానికి తోడు, ఎన్నికల ప్రచారానికి సంబంధించి, లేదంటే ఓట్లు అభ్యర్ధించే సమావేశంలో వీళ్ళు పాల్గున్నారు అంటే మాత్రం, దీని పైన, విశాఖ వచ్చిన ఎస్ఈసికి కొంత మంది రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేయటం జరిగింది.

vs 06032021 2

దీనికి సంబందించిన ఆ వీడియోలు, ఇతర ఆధారాలు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఇచ్చారు. అలాగే గతంలో కూడా కొన్ని రాజకీయ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గున్న ఆధారాలు సమర్పించటం జరిగింది. దీని పైన విశాఖలో ఫిర్యాదులు రావటంతో, రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందిస్తూ, దీని పైన తాము ఈ విషయం పై సీరియస్ గా స్పందిస్తున్నామని, దీని పైన కలెక్టర్ తో విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పటం జరిగింది. దీని పైన గవర్నర్ కి కూడా, రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిర్యాదు చేసింది. దీంతో ప్రభుత్వం ఆయన్ను సెలవు పై వెళ్ళాలని ఆదేశించినట్టు తెలుస్తుంది. నిన్నటి నుంచి ఆయన సెలవు పై వెళ్లినట్టు సమాచారం. అయితే దీని పై స్పందించిన వీసి, కేవలం విజయసాయి రెడ్డి పిలిస్తే వెళ్లానని, అది కుల పరమైన సమావేశం కావటంతోనే, వివాదం రేగింది అని, ఆయన చెప్పారు. అయితే ఇలాంటి సమావేశాల్లో ఒక హోదా ఉన్న వ్యక్తి పాల్గునటం, మాట పరమైన, కుల పరమైన సమావేశాల్లో పాల్గున్న ఆయన పై, చర్యలు తీసుకోవాలని ఈసి కోరటం, గవర్నర్ కూడా స్పందించటంతోనే, ఆయన పై ప్రభుత్వం చర్యలు తీసుకని ఉంటుందని భావిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read