నందమూరి నటసింహం సినిమా వీరసింహారెడ్డి దెబ్బకి పులివెందుల పులి అని పిలిపించుకునే వైసీపీ ప్రభుత్వం గజగజ వణికారని వార్తలు వస్తున్నాయి. సినిమాని ఆపడానికి ఏమైనా చేయగలమా? అనే ఆలోచనతో కొందరు పోలీసు అధికారులు సినిమా విడుదలైన రోజే అర్ధరాత్రి స్పెషల్ షో చూశారని వార్తలు వచ్చాయి. తన పరిపాలనని టార్గెట్ చేసుకుని క్యారెక్టర్, డైలాగులు పేలిన వీరసింహారెడ్డి సినిమా బలంగా ప్రజల్లోకి వెళ్తే వైసీపీకి డ్యామేజ్ అవుతుందని ఆందోళనలో ఉన్నారట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుర్రాడిగా వున్నప్పుడు కడప జిల్లా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అని ప్రచారం ఉంది. మీడియా వార్తలను బట్టి చూస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరసింహారెడ్డి సినిమాని తీశారని, మొత్తం డైలాగులు, సన్నివేశాలు వైసీపీని డ్యామేజ్ చేసేలా ఉన్నాయని, ఈ సినిమాని అడ్డుకునే మార్గాలు పరిశీలించాలని సీఎం ఆదేశించినట్టు తెలిసింది. దీంతో కొందరు ఉన్నతాధికారులు సినిమా చూశారు. అభివృద్ధి ఏమీ లేదని, అరాచకాలు పెరిగిపోయాయని బాలయ్య పేల్చిన డైలాగులు జగన్ సర్కారుని ఉద్దేశించినవేనని తేల్చేసిన నివేదిక అందజేశారని తెలుస్తోంది. ఈ డైలాగులు సినిమా నుంచి కట్ చేసుకుని సోషల్మీడియాలో వైరల్ చేస్తున్నారు. సినిమాలో ఆ డైలాగులు తొలగించాలని నిర్మాతలకు ఆదేశించాలని అనుకుంటున్నారని సమాచారం. లేదంటే వీరసింహారెడ్డి ప్రదర్శనకు అడ్డంకులు తప్పవని అధికారుల ద్వారా హెచ్చరికలు పంపారని ప్రచారం సాగుతోంది.
ఆ సీన్ లు కట్ చేయాలని ఆదేశించారా ? వీరసింహారెడ్డి సినిమా పై వైసీపీ వార్నింగ్ లు పని చేస్తాయా ?
Advertisements