కడప జిల్లా, కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వీరశివారెడ్డి, ఎమ్మల్యేగా పని చేసారు... అప్పట్లో రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.. మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీలో ఉండి, విభజన తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు... ఈ సంవత్సరం జగన్ కు పడిన మొదటి అక్షింతలు, వైఎస్ సన్నిహితుడి నుంచే... వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలో ఉన్న నైతికత వైసీపీ అధినేత జగన్‌లో లేదని టీడీపీ నేత వీరశివారెడ్డి ఆరోపించారు. పాదయాత్ర చేస్తే సీఎం అవుతానన్న భ్రమలో జగన్ ఉన్నారని ఎద్దేవాచేశారు. వీరశివారెడ్డి సోమవారం కమలాపురంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు...
ఈ సందర్భంగా వీరశివారెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పై ఈ వ్యాఖ్యలు చేసారు... రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా ఉండే వాడిని అని, తనని నమ్ముకున్న వారి కోసం ఎంత వరుకు అయినా వెళ్ళే వారు అని, కాని జగన్ మాత్రం, తన నీడను కూడా నమ్మడు అని అన్నారు... ఆయనకు మనుషులు అంటే చులకన భావం అని, అహంకారం అని అన్నారు... జగన్ అంటే సొంత పార్టీ నేతలకే భరోసా లేదు అని, ఇలాంటి లక్షణాలు ఉన్న వాడు, ఎన్ని వేల కిలో మీటర్లు నడిస్తే ఏమవుతుంది అని ఆరోపించారు... జగన ముందు తన అహంభావం తగ్గించుకుంటే, కనీసం ఎమ్మల్యే అయినా అవుతారు అని అన్నారు...
తాను కూడా 2019 శాసనసభ ఎన్నికల పోటీలో తెలుగుదేశం పార్టీ టిక్కెట్టు రేసులో ఉంటానని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ టిక్కెట్టు ఎవరికిచ్చినా తాను గట్టిగా పనిచేసి పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి చెబుతున్నప్పటికీ, ఆయన ఏర్పాటు చేసిన భారీ విందులో ఏదో మతలబు ఉందని పార్టీకి చెందిన పెద్దల నుంచి కొంత సూచనలు వచ్చి ఉంటాయని అందువల్లే తమ పెద్దాయన ఇలాంటి భారీ విందు ఏర్పాటు చేసారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి. ఏది ఏమైనప్పటికి ఈ భారీ విందు తర్వాత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరింత పుంజుకుని వచ్చే ఎన్నికల నాటికి ఈ స్థానాన్ని టీడీపీ ఖాతాలో వేసు కునేందుకు ఆ పార్టీ ఇప్పటినుంచే ఈ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు.