ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా, కొత్తగా సోము వీర్రాజు ఎన్నికయిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా, తమ పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తే బీజేపీ శ్రేణులు సంబరపడాలి కానీ, ఇక్కడ మాత్రం వైసీపీ శ్రేణులు సంబర పడటం ఆశ్చర్య పరిచింది. ఇలా వైసీపీ సంబరపడటానికి కారణం ఏమిటో, రెండు రోజుల్లోనే అర్ధం అయిపొయింది. గతంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ, అమరావతి ఉద్యమానికి మద్దతు తెలుపుతూ, బీజేపీ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని, అవసరం వచ్చినప్పుడు కేంద్రం స్పందిస్తుందని చెప్పారు. అయితే ఇదే విషయం పై, అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి రోజు, సోము వీర్రాజు మాట్లాడుతూ, అమరావతి ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని, ఇది మా పార్టీ తీర్మానం అని చెప్పారు. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ, నిన్న ఢిల్లీ వెళ్ళటంతో, స్వరం మారింది. 24 గంటల్లోనే సోము వీర్రాజు స్వరం మార్చటంతో, వైసిపీ శ్రేణులు మాంచి ఖుషీగా ఉన్నాయి.

నిన్న ఢిల్లీ వెళ్ళిన సోము వీర్రాజుకి, ఉత్తర్ ప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ సన్మానం చేసారు. ఈ సన్మాన కార్యక్రమంలో మాట్లాడిన సోము వీర్రాజు, అమరావతి పై మాట్లాడుతూ, అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని, అది పూర్తిగా రాష్ట్రము ఇష్టం అని, రాష్ట్ర రాజధానికి కేంద్రానికి సంబంధం లేదని చెప్పారు. కానీ, తాము రైతుల తరుపున రాష్ట్రంలో మాత్రం, నిలబడతాం అంటూ, ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. కేంద్రం జోక్యం చేసుకోదు అని చెప్పటంతో, సోము వీర్రాజు మాటలు పట్టుకుని, వైసీపీ సంబర పడుతుంది. ఇక బిల్లులు ఆమోదం పొందినట్టే అని, సోము వీర్రాజు ఇచ్చిన భరోసాతో, సంతోషంలో వైసీపీ శ్రేణులు ఉన్నాయి. అయితే కేంద్రం కొత్త రాజధానికి జోక్యం చేసుకోడు ఏమో కానీ, స్వయంగా ప్రధాని వచ్చి శంకుస్థాపన చేసి, 2500 కోట్లు ఇచ్చి, అమరావతిని రాజధానిగా గుర్తించి, హైకోర్టు నోటిఫికేషన్ ఇచ్చి, రైతులకు పన్ను మినహాయంపులు ఇచ్చి, ఇన్ని చేసిన రాజధాని మార్చి, మరో రాజధాని అంటే, కేంద్రం ఒప్పుకుంటుందా అనే ప్రశ్న వస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read