2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు అని నిర్ణయించే బీజేపీ నాయకుడు సోము వీర్రాజు, కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన మూడు రోజులుకి మీడియా ముందుకు వచ్చారు... వచ్చి, ఏదేఏదో మాట్లాడుతున్నాడు... గుజరాత్ లో బీజేపీ గెలుస్తుంది అని తెలుస్తున్న టైంలోనే, ప్రెస్ మీట్ పెట్టి, నేను గుజరాత్ లో బీజేపీని గెలిపించా అన్నంత హడావిడి చేసారు... అలాగే కేంద్ర బడ్జెట్ పై కూడా వెంటనే స్పందిస్తారు అని అందరూ అనుకున్నారు... ఒక పక్క తెలుగుదేశం విమర్శలు చేస్తున్నా, వీర్రాజు మాత్రం, బయటకు రాలేదు... ఎట్టకేలకు ఇవాళ వచ్చారు...
అమిత్ షా ఢిల్లీలో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ పక్కగా జరుగుతుంది అని, నవయుగ వచ్చిన తరువాత పనులు స్పీడ్ అందుకుంటాయని, నవయుగని మేమే తెచ్చాం అని చెప్తుంటే, ఇక్కడ వీర్రాజు మాత్రం, పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఇచ్చిన నిధుల్లో ఎంతమేర పనులు జరిగాయని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రానికి అప్పజెప్పేస్తామని ప్రకటించిన చంద్రబాబు... ఇప్పుడు మరో కంపెనీని తెరపైకి ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపిన ఘనత కూడా బీజేపీదే అని చెప్పారు.
బడ్జెట్ పై అసహనం ఉంటే అడగాలి కాని, విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. మిత్రపక్షంగా ఉన్న తమపై విమర్శలు గుప్పించడం సరికాదని అన్నారు. ఇలా అంటూనే, టీడీపీ ఎంపీలు టీజీ వెంకటేశ్, రాయపాటి సాంబశివరావుల పై పర్సనల్ గా టార్గెట్ చేస్తూ విమర్శలు చేసారు సోము వీర్రాజు.. ఒక పక్క, అమిత్ షా, ఢిల్లీ నుంచి కంట్రోల్ కంట్రోల్ అంటుంటే, సోము వీర్రాజు మాత్రం, వీర ప్రతాపం చూపిస్తున్నారు... కేంద్ర బడ్జెట్ వల్ల, రాష్ట్రం ఎంతో బాగుపడిపోతుంది అని చెప్తున్నారు...