విశాఖ నగరానికి పాలనా రాజధాని తరలింపు యోచన నేపథ్యంలో వెలగపూడి సచివాలయం వెలవెలబోతోంది. కొద్ది రోజుల క్రితం వరకు శాసనసభ సమావేశాలతో కోలాహలంగా కొన్న సచివాలయ ప్రాంగణం గత వారం రోజులుగా రాజధాని రైతుల ఆందోళనల కారణంగా బోసిపోతోంది. రాయలసీమ, ఉత్త రాంధ్ర ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది ప్రజలు సచివాలయానికి రాకపోకలు కొనసాగిస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి మంత్రులు, అధికారులు అందుబాటులో ఉండా లని కూడా వైఎస్ జగన్మో హన్ రెడ్డి ఆదేశించారు. ప్రతి మంగళ, బుధ వారాల్లో విధిగా మంత్రులు సచివాలయంలో అందుబాటులో ఉండాలని నిర్దేశించారు. దీంతో పాటు ప్రతి రెండవ బుధవారం మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తు న్నారు. జగన్ కూడా సచివాలయంలోనే ఉండి పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే మూడు రాజధానుల ప్రకటన కారణమో, జగన్ కడప జిల్లా పర్యటన కారణమో కానీ గత ఎనిమిది రోజులుగా మంత్రులు సచివాలయానికి రావటం లేదు.
మంగళవారం రాష్ట్ర రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్ మాత్రమే తన ఛాంబర్ లో కొద్ది సేపు గడిపారు. మిగిలిన మంత్రులు, కొందరు ఉన్నతాధికారుల కార్యాల యాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి సహాయనిధి, ఇతరత్రా లావా దేవీల నిమిత్తం రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు నుండి కూడా అనేక మంది తమ తమ నియోజకవర్గాలకు ప్రాతి నిధ్యం వహిస్తున్న మంత్రు లను కలుసుకునేందుకు వస్తుంటారు. తాజా పరిణా మాల నేపథ్యంలో అటు మంత్రులు కానీ, ఇటు సందర్శకులు కానీ కనిపించటం లేదు. సచివా లయం మార్గంలోనే రైతులు గత వారం రోజులుగా వివిధ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పోలీ సులు పహారా కాస్తున్నప్పటికీ రాకపోకలకు విఘాతం కలుగుతోంది. దీంతో పాటు రాజధాని తరలింపుపై ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు ఎలాంటి హామీ ఇచ్చినా లేనిపోని తలనొప్పులు ఎదురవుతాయనే భావనతో కృష్ణా, గుంటూరు జిల్లాల మంత్రులు కూడా దూరంగా ఉంటున్నట్లు సమాచారం .
ఈనెల 27న మంత్రివర్గ సమావేశంలో ప్రభు త్వమే నేరుగా రాజధానిపై ప్రకటిస్తుంది. కనుక ఇప్పుడే దీనిపై స్పందించటమెందుకనే భావనతో వారు ఉన్నట్లు తెలియవచ్చింది. ఇదిలా ఉండగా విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించి హెచ్ఓడీలకు ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. జిల్లా అధికారులతో సంప్ర తింపులు జరిపి శాఖాపరంగా ప్రధాన కార్యాలయ భవనాలను అన్వేషించాల్సిందిగా సూచనలందా యని చెప్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం సచివాల యంలో హెచ్ఓడీల వారీగా పనిచేస్తున్న ఉద్యో గులు సొంత భవనాల్లో నివసిస్తున్నారా? అద్దెకు ఉంటున్నారా అనే విషయాలను కూడా ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్ నుంచి వచ్చే ఉద్యోగుల్లో కొందరు ఇప్పటికే ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మరికొందరు హైదరాబాద్ నుంచి నేరుగా రాకపోకలు కొనసాగి సున్నారు. రాజధాని తరలిస్తే తలెత్తే ఇబ్బందులపై ఉద్యోగ వర్గాల అభిప్రాయాలను కూడా సేకరిస్తు న్నట్లు తెలిసింది.