రెండేళ్లుగా తన సొంత ఖజానా నింపుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అనేక ఆదాయ మార్గాలను ఏర్పాటు చేసుకున్నాడని, ఇసుక, మద్యం, భూముల అమ్మకం, ఖనిజాల తవ్వకంతో ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిలో ఉన్నారని, ఆ విధంగా చేస్తున్నాకూడా రాష్ట్ర నాయకుడి ధనదాహం తీరడంలేదని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే యథాతథంగా మీకోసం...! ఇసుక కుంభకోణంలో కొన్నివాస్తవాలను తాము గమనించాము. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకరీచ్ లను చేజిక్కించుకున్న జయప్రకాశ్ పవర్ వెంచర్స్ వారు, ఉన్నట్టుండి అకస్మాత్తు గా 03-06-2021న భవానీపురం పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యా దు చేశారు. సదరు కంపెనీ ఫైనాన్స్ మేనేజర్ విశ్వనాథన్ సతీశ్ ఫిర్యాదు చేశారు. జూన్ 3న ఫిర్యాదు చేస్తే, జూన్ 4న పోలీసులు ఎఫ్ఐఆర్ (295/2021) నమోదు చేశారు. కొందరు వ్యక్తులు జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కంపెనీ పేరుని వాడుకుంటూ, ఇసుక రీచ్ లకు సంబంధించి సబ్ లీజులు ఇస్తామని చెబుతూ, తిరుగుతున్నారని విశ్వనాథన్ సతీశ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు వ్యక్తులను కలవడానికి తాను పంటకాలువ రోడ్డులోని మైల్ స్టోన్ సెంటర్ , గొల్లపూడిలోని ఒకగృహానికి వెళ్లినట్టు, సతీశ్ తన ఫిర్యాదులో చెప్పారు. కొప్పురావూరు ప్రవీణ్ కుమార్, మల్లంపాటి శ్రీనివాసరావు, ముక్కొల్లు నాగమల్లేశ్వరరావులను కలవడానికి సతీశ్ అక్కడికివెళ్లగా, సుధాకర్ ఇన్ ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి చెందిన వ్యక్తులుగా వారు తమని తాము పరిచయం చేసుకున్నారని, , సదరు కంపెనీకి జయప్రకాశ్ పవర్ వెంచర్స్ వారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇసుక మైనింగ్ సబ్ లీజులు ఇచ్చినట్లుగా తనతో చెప్పినట్లు విశ్వనాథన్ తన ఫిర్యాదులో చెప్పారు. అందుకు ఆధారంగా వారు రెండు ఫోర్జరీ డాక్యుమెంట్లు చూపారని, సుధాకర్ ఇన్ ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి అయిన సురేంద్రనాథ్ అనే వ్యక్తి, నేలపు తిరుమల రెడ్డి మరియు వెల్లంపల్లి రఘునరసింహారావులను ఇసుకరీచ్ లను సబ్ లీజులకు ఇవ్వడానికి నియమించినట్లు తనతో చెప్పారని సతీశ్ తన ఫిర్యాదులో పొందుపరిచారు. వారు చెప్పింది విని, వారు చూపినవి గమనించాకే తాను ఫిర్యాదు చేస్తున్నట్లు సతీశ్ భవానీపురం పోలీసులకు చెప్పడం జరిగింది. ఈ వ్యవహారం అంతా గమనించాక అసలు వాస్తవేమిటనే దానిపై తాముఆరా తీశాము. జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కంపెనీని అడ్డంపెట్టుకొని, తాడేపల్లి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక దోపిడీ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఆ దోపిడీలో ఏ జిల్లా నుంచి ఎవరెవరు, ఎంత దోచుకుంటున్నారు... తమకి ఎంత వస్తుందని తాడేపల్లి పెద్దలు లెక్కలేసుకుంటారు కదా. .! ఆలెక్కల్లో ఎక్కడ తేడా లొచ్చాయో గానీ, ఈవ్యవహారం బయటకు వచ్చింది. సతీశ్ త నఫిర్యాదులో చెప్పిన కొప్పురావూరి ప్రవీణ్ కుమార్ అనేవ్యక్తి రాష్ట్ర ధర్మాదాయ, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకి చెందిన కంపెనీలో మేనేజర్. మల్లంపాటి శ్రీనివాసరావు మంత్రికి అత్యంత సన్నిహితుడు, ప్రముఖ బియ్యం వ్యాపారి.

ముక్కొల్లు నాగమల్లేశ్వరరావు వెల్లంపల్లికి సమీప బంధువు, ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో డీజీఎంగా పని చేస్తున్నాడు. మరొక వ్యక్తి అయిన కే. సురేంద్రనాథ్, మాదిరెడ్డి ప్రతాప్ (ఐపీఎస్) అనే ఆయనకు సమీపబంధువు, మాదిరెడ్డి ప్రతాప్ ఆర్టీసీఎండీగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వెల్లంపల్లి రఘునరసింహారావు మంత్రి గారికి స్వయానా సోదరుడే. మంత్రే తన సోదరుడిని జగన్మోహన్ రెడ్డి దగ్గరకు కూడా తీసుకెళ్లాడు. ఇసుక దోపిడీకి సంబంధించిన లెక్కల్లో తేడాలు వచ్చాకే, ఈ వ్యవహారమంతా బట్టబయలైంది. విశ్వనాథన్ సతీశ్ ఫిర్యాదుని అడ్డంపెట్టుకొని, దోపిడీ లెక్కల్లోని తేడాలను సరిచేసే పనిలో తాడేపల్లి ప్యాలెస్ ఉంది. ఇసుక దోపిడీకి సంబంధించి మంత్రి వెల్లంపల్లి దగ్గర ఉండిపోయిన కొన్నికోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారంలో భాగంగానే, ఈ తంతు జనంలోకి వచ్చింది. విశ్వనాథన్ ఫిర్యాదులో చెప్పిన వారిలో పోలీసులు ఎందరిని అరెస్ట్ చేసి, విచారించారు? వందలకోట్ల ఇసుక కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో పోలీసులు ఎవరిని విచారించి, ఏం తేల్చారో డీజీపీ చెప్పాలి. మా దగ్గరున్న ఆధారాల తోనే డీజీపీని అడుగుతున్నాం. జయప్రకాశ్ పవర్ వెంచర్స్ వారు మంత్రి సోదరుడిపై ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తాడేపల్లి ప్యాలెస్ లెక్కతేలాక, జయప్రకాశ్ కంపెనీ వారి ఫిర్యాదుని చించి చెత్తబుట్టలో పడేస్తారా? వెల్లంపల్లి శ్రీనివాస్ ఊసరవెల్లినే మించిపోయాడు. ఇప్పటికే నాలుగు పార్టీలు మారి చివరకు మంత్రయ్యాడు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తానని ముఖ్యమంత్రి చెప్పిన సంగతి తెలిసిందే. దాంతో దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా, ఊసరవెల్లి మంత్రి వెల్లంపల్లి తనదోపిడీని ఇసుక మాఫియాకు విస్తరించాడు. ఇసుక మాఫియాలో వందల కోట్లుదోచేసి, తాడేపల్లికి లెక్కలు చెప్పకుండా, కప్పం కట్టకుండా అంతాతానే మింగేసే సరికి, చివరకు వ్యవహారం పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు నమోదయ్యేవరకువచ్చింది. మంత్రి వెల్లంపల్లికి అశోక్ గజపతిరాజు గురించి మాట్లాడేఅర్హత, స్థాయి ఉందా? సోదరుడిని, బంధువులను అడ్డంపెట్టుకొని దోపిడీ చేస్తూ, అశోక్ గజపతిరాజుని అంటాడా? వెల్లంపల్లి ఎక్కడున్నా, ఏ పదవిలో ఉన్నా తన బుద్ధి మారదనడానికి ఈ ఉదంతమే నిదర్శనం. ఊసరవెల్లి వెల్లంపల్లి అవినీతి బాగోతంపై ముఖ్యమంత్రి, తాడేపల్లి ప్యాలె స్ జీతగాడు సజ్జల ఏం సమాధానంచెబుతారో చెప్పాలి. తాను అడిగే ప్రశ్నలకు,జయప్రకాశ్ పవర్ వెంచర్స్ ఫిర్యాదు పై మంత్రి వెల్లంపల్లి ఏం సమాధానంచెబుతాడు? భవానీపురం పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ పైసజ్జల ఏం చెబుతాడు? వెల్లంపల్లిని, ఆయన సోదరుడిని, బంధు వులను ఎంతసేపు విచారించి, ఎవరిని జైలుకు పంపుతాడో చెప్పాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read