రాష్ట్రంలో మూడు రాజధానుల వ్యవహారం పై, రచ్చ జరుగుతూనే ఉంది. అయితే విశాఖ, కర్నూల్ వైపు నుంచి, పెద్దగా ఎలాంటి స్పందన రాలేదు. ఎందుకో కాని, అక్కడ ప్రజలు, నిర్లిప్తతగా ఉన్నారు. ప్రశాంతంగా ఉన్న మాకు, ఈ గోల ఎందుకు అనుకున్నారో ఏమో కాని, అటు వైపు ప్రజలు పెద్దగా సంబరాలు చేసుకున్న పరిస్థితి అయితే లేదు. ఇక ఎటు పోయి, రోడ్డున పడింది మాత్రం అమరావతి ప్రజలు. అప్పట్లో మన రాష్ట్రానికి రాజధాని లేదని, మన రాష్ట్రానికి ఒక మంచి రివర్ ఫ్రంట్ కాపిటల్ కావాలని, మన కోసం వారు, తమ భూములు త్యాగం చేసారు. రాజధాని ఒక మెగా సిటీ అయితే, తమకు కూడా లాభం ఉంటుందని అనుకున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మారటంతో, రాజధాని తరలి పోతుంది అనే వార్తలు రావటంతో, వారి జీవితాలు రివర్స్ అయ్యాయి. దీంతో వారు ఆందోళన చేస్తున్నారు. అందరినీ కలిసి తమ గోడు చెప్పుకుంటూ, ఆశగా వారి వైపు చూస్తున్నారు. ఇదే కోవలో, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కూడా కలిసి, తమ గోడు చెప్పుకున్నారు.

venkaiah 25122019 2

అయితే నిన్న వారి వద్ద ఏ రాజకీయం మాట్లాడని వెంకయ్య, నేను మీ బాధ విన్నాను, నేను ఇప్పుడు రాజ్యంగ పదవిలో ఉన్నాను, నాకు కొన్ని పరిమితులు ఉంటాయి, మీ బాధ నాకు అర్ధమైంది, ఎవరితో చెప్పాలో, వారికి చెప్తాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే, ఈ రోజు స్వర్ణ భారతి ట్రస్ట్ లో మీడియా తో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చిట్ చేస్తూ, కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. "మాతృభాష కు ప్రాధాన్యం విషయం లో నాది మొదటి నుంచి ఒకటే అభిప్రాయం. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు లో ప్రాధమిక బోధన ఉండాలనేదే నా అభిప్రాయం. ప్రధాని సైతం మాతృ భాష కు ప్రాధాన్యం పై అనేక సార్లు చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ కు నేను మొదటి నుంచి కట్టుబడి ఉన్నాను. రాష్ట్రం ఏర్పడిన తరువాత కేంద్ర సంస్థ లను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసాము."

venkaiah 25122019 3

"కేంద్ర మంత్రి గా నాడు ప్రత్యేకం గా చొరవ తీసుకుని జిల్లాకో కేంద్ర సంస్థ ఏర్పాటు అయ్యేలా చూసాను. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇలా జరగాలి. పాలన ఒక్క చోట నుంచే ఉండాలనేది నా నిశ్చితాభిప్రాయం. ముఖ్యమంత్రి, పాలనా యంత్రంగం హైకోర్టు, అసెంబ్లీ ఒక్క చోటనే ఉండాలి. అన్ని ఒక్క చోట ఉంటేనే పాలనలో సౌలభ్యం ఉంటుంది. అది ఎక్కడ అనేది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం. నా 42 ఏళ్ళ అనుభవం తో ఈ మాట చెపుతున్నా. వివాదం కోసమో, రాజకీయం కోణం లోనో నా అభిప్రాయం చూడవద్దు. కేంద్రం నన్ను అడిగితే నేను ఇదే అభిప్రాయం చెపుతా. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. పరిపాలన కేంద్రీకృతం కావాలి. నిన్న రాజధాని రైతులు నా వద్దకు వచ్చారు. వాళ్ల భావోద్వేగం చూసి నా మనసు చలించింది" అని వెంకయ్య అన్నారు." అంటూ చెప్పుకొచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read