కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పై తెలుగుదేశంప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండానే పార్లమెంట్ లో, కెసిఆర్, అన్నాడీయంకేని అడ్డు పెట్టుకుని ఎలా పారిపోతుందో చూస్తున్నాం.... అలాగే వివిధ డిమాండ్ల పై ఆయా పార్టీల సభ్యులు వెల్ లో ఉభయ సభల్లో ఆందోళన చేస్తున్నారు... వరుసగా 12వ రోజు సభ వాయిదా పడింది... రాజ్యసభలో కూడా ఇదే సీన్ కనిపిస్తుంది... పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచీ ఇదే వరస. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై మూడో వారంలోకి అడుగుపెట్టడంతో ఇప్పటికైనా పరిస్థితి అదుపులోకి వస్తుందని భావించారు...
ఈ నేపధ్యంలో వెంకయ్య నాయుడు అందరినీ అవాక్కయ్యే నిర్ణయం తీసుకున్నారు... రాజ్యసభ సభ్యులకు బుధవారం విందు ఇవ్వాలని భావించిన వెంకయ్య, అందుకు తగిన ఏర్పాట్లను గతవారమే చేసుకున్నారు... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి, సభలో అధికార, ప్రతిపక్ష నాయకులు, ఫ్లోర్ లీడర్లతో ఇప్పటికే విందు గురించి మాట్లాడిన వెంకయ్య, ఆహ్వాన పత్రికలను కూడా సిద్ధం చేసుకున్నారు... అయితే, అనూహ్యంగా, వెంకయ్య విందు రద్దు చేసుకున్నారు... సభ్యులకు ఇచ్చే మర్యాదపూర్వక విందును రద్దు చేసినట్టు చెప్పారు..
అయితే, ఈ నిర్ణయం పై, అందరూ ఆశ్చర్యపోయారు... దీనికి కారణం, సభ సక్రమంగా సాగనందుకు మాత్రమే ఈ విందు రద్దు చేసుకున్నారని బయటకు చెప్తున్నారు... అయితే, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి, సభలో అధికార, ప్రతిపక్ష నాయకులు, ఫ్లోర్ లీడర్లకు ఇప్పటికే సమాచారం ఇచ్చి, ఇలా చెయ్యటంతో, ఏమైనా బలమైన కారణం ఉందా అనే సందేహం కూడా వస్తుంది... ఎందుకంటే, ఇలాంటి వాయిదాలో, కొన్ని సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉన్నాయి.. దీంట్లో కొత్త ఏమి లేదు... మరి, వెంకయ్య ఇంత నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అని, ఢిల్లీ పెద్దలు కూడా ఆశ్చర్యపోయారు...