అమరావతి ఉద్యమంలో, కొంత మంది పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహంతో, మొత్తం పోలీస్ డిపార్టుమెంటుకే చెడ్డ పేరు వస్తుంది. ఎవరినో మెప్పు పరచటానికి, వీళ్ళు చేస్తున్న అతితో, జాతీయ స్థాయిలో పరువు పోతుంది. అమరావతిని తరలిస్తారు అని జరుగుతున్న ప్రచారం పై, ప్రభుత్వం ఆ విధంగా చేస్తున్న చర్యల పై, అటు అమరావతి రైతులతో పాటుగా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు కూడా, అమరావతిని తరలించ వద్దు అంటూ, రైతులకు మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. అయితే చిన్న పాటి నిరనస కూడా ప్రభుత్వం తట్టుకోలేక పోతుంది. శాంతియుతంగా వారు నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వాలు తట్టుకోలేక పోతున్నాయి. దీని కోసం పోలీసులను ఉపయోగించి, తోక్కేస్తున్నారు. అమరావతిలో మహిళా రైతులను, కనీసం కనకదుర్గ గుడికి కూడా వెళ్ళనియ్యకుండా ఏమి చేసరోచుసాం. అయితే వీరికి మద్దతుగా, గుంటూరులో మహిళలు ర్యాలీ చెయ్యటంతో, అది సూపర్ సక్సెస్ అయ్యింది.
అయితే ఇదే తరహాలో, విజయవాడలో కూడా మహిళలు, అమరావతి రైతులకు మద్దతుగా ర్యాలీ చేద్దామని అనుకున్నారు. అయితే పోలీసులు అడుగడుగగునా అడ్డుకున్నారు. పర్మిషన్ లేదని, ఎవరూ ర్యాలీ చెయ్యటానికి వీలు లేదని చెప్పారు. అలా చేస్తే అరెస్ట్ చేస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే ఎక్కువ మంది మహిళలను అరెస్ట్ చేసి, వారి వివరాలు, కులం వివరాలు కూడా అడిగి తీసుకుని, సాయంత్రం వదిలి పెట్టారు. అయితే ఇదంతా పెద్ద గందరగోళం మధ్య జరిగింది. అయితే అనూహ్యంగా, పోలీసులు మూడు రోజుల తరువాత, వందల మంది పై కేసులు నమోదు చేసారు. అంతే కాదు, వీరి వివరాలు పాస్ పోర్ట్ ఆఫీస్ కి కూడా పంపిస్తున్నామని, పాస్ పోర్ట్ రద్దు అవుతుంది అంటూ, ఒక ప్రచారానికి కొంత మంది తెర లేపారు.
దీంతో చాలా మందికి, ఏమి జరుగుతుందో అర్ధం కాలేదు. విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ, పాస్‌పోర్ట్ రద్దుచేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని, అదే జరిగితే ఏమి చెయ్యాలో మాకు తెలుసని, ఎవరూ భయపడద్దు అని చెప్పారు. అయితే ఈ ప్రచారం బాగా జరగటంతో, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి చేరడంతో సోమవారం విశాఖ పాస్‌పోర్టు అధికారి ఎన్.ఎల్.పి.చౌదరికి ఫోన్ చేసి, అసలు జరుగుతున్న ప్రచారం ఏమిటి అంటూ ఆరా తీసారు. పాస్‌పోర్టులను రద్దు చేస్తామని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఆ అధికారి వెంకయ్యకు చెప్పారు. కేసులు ఉండి, న్యాయ విచారణలకు హాజరు కాకుండా తప్పించుకు తిరిగే వారి పాస్‌పోర్టులు మాత్రమే రద్దవుతాయని ఒక ప్రకటనలో చెప్పారు.