ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత పధకాలు చూస్తుంటే అసహ్యం వేసే స్థాయికి వెళ్తుంది. నిజంగా సంక్షేమం అంటే, ఆపదలో ఉన్న వాడిని ఆదుకోవటం. వృద్ధులైన వారికి, వికలాంగులను ఆదుకున్నారు అంటే అర్ధం ఉంది. తిండి లేని వాడికి తిండి పెట్టారు అంటే అర్ధం ఉంది. గుడిసెల్లో ఉండే వారికి ఇల్లు కట్టారు అంటే అర్ధం ఉంది. కానీ ఈ మధ్య మాట్లాడితే ఫ్రీ అంటున్నారు, స్కూల్ కి పంపిస్తే డబ్బులు ఇవ్వటం ఒక పధకం. ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఒక పధకం. ఇలా అన్నీ ఫ్రీ పధకాలే. పోనీ ఈ పధకాలు అన్నీ మనకు డబ్బులు ఉండి ఇస్తున్నామా అంటే, కాదు అప్పు తెచ్చి ఇస్తున్నాం. మన ఆదాయం 50 రూపాయాలు అయితే, వంద రూపాయలు అప్పు తెస్తున్నాం. మరి ఇవి తీర్చాలి అంటే ? అందుకే పన్నులు బాదుడు. చివరకు మన జేబులో నుంచి 20 రూపాయలు తీసి, ఉచితాల పేరుతో 10 రూపాయలు పెడుతున్నారు. ఇదా సంక్షేమం అంటే ? ఇదే అంశం కాకపోయినా, ఈ ఉచిత పధకాల పై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. నిన్న విజయవాడ వచ్చిన ఉపరాష్ట్రపతి, ఉచిత పధకాల పై స్పందించారు. ప్రజలను ఆకర్షించే పధకల మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టి, ఉన్న డబ్బు ఎక్కువగా ఉచితాలకు ఖర్చు పెడితే, ప్రజలకు ఏమి ఉపయోగం అని అన్నారు.

venkaiah 31102021 2

దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే పధకాలను ప్రభుత్వాలు ప్రవేశపెట్టాలని అన్నారు. ఉచితాల వల్ల ప్రజల జీవితాలకు ఏ మాత్రం మేలు జరగదని, తాను, తన 50 ఏళ్ల ప్రజాజీవితంలో గమనించిన అంశం అని అన్నారు. ఇబ్బందిగా ఉన్న వారికి అన్నం పెట్టటం, ఉచిత బియ్యం ఇవ్వటం తప్పు లేదు కానీ, ఉన్న వారికి కూడా బియ్యం ఇవ్వటం ఎందుకు అని అన్నారు. ఈ దేశంలో రేషన్ కార్డు ఉన్న వారు అందరూ పేద వాళ్ళే అంటారా ? అని ప్రశ్నించారు. ఇవి ప్రజలు ఆలోచించాలి అని అన్నారు. రైతులకు కావాల్సింది ఉచిత విద్యుత్ కాదు అని అన్నారు. రైతులకు కావలసింది 10-12 గంటల నాణ్యమైన, నిరాటంకమైన విద్యుత్ అని, రైతులకు ఇది ఉంటే, ఉచిత విద్యుత్ అవసరం లేదని అన్నారు. తాను రైతునే అని, అన్నీ తనకు కూడా తెలుసు అని అన్నారు. రైతులకు మారెక్టింగ్ సౌకర్యం కావాలని, కోల్డ్ స్టోరేజ్ లు కావాలని, గోడౌన్ లు కావాలని, ఇవి ప్రభుత్వాలు రైతుకు చేయాల్సిన అనుకూలమైన పనులు అని, ఉచిత విద్యుత్ కాదని అన్నారు. మరి ప్రభుత్వాలు ఈ మాటలు విని, రాష్ట్రాన్ని గాడిలో పెడతాయో, లేక తమ ధోరణిలోనే ఓట్ల రాజకీయం చేస్తాయో చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read