నిన్న నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌కు(ఎన్‌ఐడీఎం) కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరు గ్రామంలో శంకుస్థాపన చేశారు ఉప రాష్ట్రపతి వెంకయ్య.. ఈ సందర్భంలో వెంకయ్య చేసిన వ్యాఖ్యల పై ఢిల్లీ బీజేపీ పెద్దలు షాక్ కు గురయ్యారని సమాచారం.. ప్రస్తుతం చంద్రబాబు, బీజేపీ పై ఒక యుద్ధమే చేస్తున్నారు... మొన్నటి వరకు మోడీ, షా జైత్ర యాత్రకు ఎదురు లేదు అనుకుంటున్న టైంలో, చంద్రబాబు ఎంటర్ అవ్వటం, మోడీని ఏకి పడేయటం, కర్ణాటకలో బీజేపీని ఓడించాలని పిలుపు ఇవ్వటం, ఇవన్నీ బీజేపీ పెద్దలకు మింగుడు పడటం లేదు.. ఒక పక్క అమిత్ షా పై తిరుపతిలో నిరసన, మరో పక్క కర్ణాటక ఓటమికి తెలుగు వారే కారణం అనుకుంటూ, బీజేపీ పెద్దలు చంద్రబాబు పై ఆగ్రహంగా ఉన్న వేళ, నిన్న అమరావతిలో వెంకయ్య మాటలు బీజేపీ అధిష్టానానికి మింగుడు పడటం లేదు..

venkayya 23052018 2

‘‘నేను కేంద్ర మంత్రిగా ఉండగా, రాష్ట్రానికి కేంద్ర సంస్థలు వచ్చేందుకు ఉన్న అవకాశాలను ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పేవాడిని. ఆయన చొరవ తీసుకొని, ఆ సంస్థల ఏర్పాటు కోసం భూములను కేటాయించేవారు. దానివల్లే ఇప్పుడు భారీ సంఖ్యలో కేంద్ర సంస్థలు ఏపీకి వస్తున్నాయి’’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చంద్రబాబు పై ప్రసంసలు కురిపించారు... ‘‘కొండపావులూరులో 400 ఎకరాలకు పైగా భూముల్లో అనేక కేంద్ర సంస్థలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో.. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ 25 ఎకరాలలో, ఆయుష్‌ 25 ఎకరాలలో, ఎన్‌ఐడీఎం 10 ఎకరాలలో, ఐఐపీఎం 15 ఎకరాలలో, అమరావతి యూనివర్శిటీ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ 100 ఎకరాలలో, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ 25 ఎకరాలలో కొలువు తీరబోతున్నాయి’’ అని వెంకయ్య వివరించారు. ..

venkayya 23052018 3

ఒక పక్క బీజేపీ వాళ్ళు ఇవన్నీ మా మోడీ పెట్టిన బిక్ష అంటూ ఉంటే, ఇప్పుడు సాక్షాత్తు ఉప రాష్ట్రపతి వచ్చి, చంద్రబాబు పై కృషి వల్లే అన్నీ సాధ్యం అయ్యాయి అని చెప్పారు... చంద్రబాబుకీ, బీజేపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ఇలాంటి పరిస్థితుల్ల్లో కూడా వెంకయ్య నాయుడు గారు చంద్రబాబుకి కితాబు ఇస్తన్నారంటే , అర్ధం కావట్లా ఎవరు ఏంటో అని ? వెంకయ్య నాయుడుని తప్పించి బీజేపీ పార్టీ అతి పెద్ద తప్పు చేసింది అనుకునే లోపే, చంద్రబాబుతో సున్నం పెట్టుకుని అంతకంటే పెద్ద తప్పు చేసింది. డబల్ సూసైడ్ అన్నట్టు.. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయడు.. వీళ్ళ స్థాయి ఏంటి, అనుభవం ఏంటి ? సమర్ధత ఏంటి ? వీళ్ళకీ, ఇప్పుడు కొత్తగా వచ్చి మిడిసి పడతన్న బ్యాచ్ కీ ఏవన్నా తేడా ఉందా ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read