ఉప రాష్ట్రపతి హోదాలో వెంకయ్య నాయుడు గారు, పోలవరం మీద రివ్యూ చేసి దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచారు... ఉప రాష్ట్రపతి హోదాలో ఉంటూ, ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్ట్ గురించి, అదీ రాష్ట్ర బీజేపీ ప్రజా ప్రతినిధులను కూడా కూర్చోబెట్టుకుని, ఎలా సమీక్ష చేస్తారు అంటూ విమర్శలు వస్తున్నాయి... విమర్శలు, రూల్స్ ఎలా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, ఇది ఆహ్వానించ దగ్గ పరిణామం... మొన్నటి దాకా, కేంద్రంలో అన్నీ తానై, రాష్ట్ర సమస్యలు పరిష్కరించే వారు వెంకయ్య... కాని, ఆయన్ను ఉప రాష్ట్రపతిగా పంపించిన దగ్గర నుంచి, కేంద్రంలో మన గురించి పట్టించుకునే నాధుడే లేడు...
రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం, ఇలాంటివి పట్టించుకోక, ఎప్పుడు ఎప్పుడు చంద్రబాబుని వదిలించుకుని, జగన్ తో కలిసి వెళ్దామా అని ఉబలాట పడుతున్నారు... ఏ సమస్య వచ్చినా, చంద్రబాబు ఢిల్లీతో సమనవ్యయ పరుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు... పోలవరం విషయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైయ్యయో చూసాం. ఈ పోలవరం విషయం అసలు ఏమి జరుగుతుందో తెలుసకునేందుకు, సమస్యలు అధిగమించేందుకు, మళ్ళీ వెంకయ్య రంగంలోకి దిగారు... పోలవరం పురోగతిపై ఉప రాష్ట్రపతి హోదాలో వెంకయ్యనాయుడు సమక్షంలో సమీక్ష జరిగింది.
ఢీల్లీలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, బీజేపీ ఎమ్మెల్య విష్ణుకుమార్ రాజు, రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా పోలవరం పనుల్లో ఎదురౌతున్న సమస్యలు.. వాటి పరిష్కార మార్గాలపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్ధన మేరకు, వెంకయ్య ఈ సమీక్ష నిర్వహించినట్టు తెలుస్తుంది... తాను ఈ ప్రాజెక్టును వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నా అని, 2019 నాటికి నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తనదని నితిన్ గడ్కరీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యకు హామీ ఇచ్చారు.