రెండు రోజుల పాటు జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, వివిధ కేంద్ర మంత్రులను కలిసారు. వారిని కలిసి వెంకన్న ప్రసాదం, శాలువా కప్పి సత్కరించారు. అయితే, ఆయన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కలిసిన సందర్భంలో, జగన్ కు కొంత చేదు అనుభవం ఎదురైనట్టు తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్ట్, రాష్ట్రానికి రావాల్సిన నిధులు పై, మీ వంతు సహకారం అందించాలని జగన్ మోహన్ రెడ్డి, వెంకయ్య నాయుడుని కోరారు. అయితే, ఈ నేపధ్యంలో, వెంకయ్య, జగన్ కు చురకలు అంటించనట్టు తెలుస్తుంది. మీరు కూడా గత ప్రభుత్వం చేసిన తప్పులే చేస్తున్నారు, సరి చేసుకోండి అని సూచనలు ఇచ్చారు. మీ తప్పులతో మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చే విధంగా మీ విధనాలు ఉంటున్నాయని వెంకయ్య అన్నారు.
నేను మీరు చెప్పినా, చెప్పకపోయినా ఎప్పుడూ రాష్ట్రానికి సహాయం చేస్తాను అని వెంకయ్య చెప్తూ, మీరు నిర్మాణాత్మక రీతిలో కాకుండా విధ్వంసక రీతిలో పనిచేస్తే సాయం చేయడం కష్టమని, నేను కూడా ఏమి చేసేది ఉండదని వెంకయ్య తేల్చిచెప్పినట్లు తెలిసింది. అయితే ఈ మాటలు వెంకయ్య చెప్పటం వెనుక కారణం ఏంటి అని అరా తీస్తే, ఇప్పటికే జగన్ వ్యవహర శైలి పై కేంద్రం గుర్రుగా ఉందని సమాచారం. ఢిల్లీ పెద్దల దగ్గర వినయం నటిస్తూ, రాష్ట్రానికి వచ్చి మాత్రం, వాళ్ళు చెప్పినట్టు కాకుండా, కేంద్రం సూచనలు కనీసం పరిగణలోకి తీసుకోకుండా, జగన్ వ్యవహరిస్తున్న తీరు కారణంగా తెలుస్తుంది. రాష్ట్రంలో పరిస్థితులు కూడా కంట్రోల్ తప్పుతూ ఉండటం కూడా కారణం అని తెలుస్తుంది.
గత ప్రభుత్వం చేసిన పనులు అన్నీ సవ్యంగా నడిపించాల్సిన టైంలో, అన్నీ ఆపేస్తూ, పరిస్థితిని జగన్ జటిలం చేస్తున్నారని, ఇసుక ఎందుకు ఆపారో అర్ధం కావటం లేదని, రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడటం కుడా వింటున్నాయి. అయితే రెండు రోజుల జగన్ ఢిల్లీ పర్యటనలో, కేంద్రం నుంచి పెద్దగా అభయం వచ్చినట్టు కనిపించటం లేదు. ముఖ్యంగా జగన్ వెళ్ళింది, పోలవరం టెండర్ రద్దు గురించి చెప్పటానికి, అలాగే విద్యుత్ ఒప్పందాల సమీక్ష పై వివరణ ఇవ్వటానికి. అయితే ఈ రెండిటి పై కేంద్రం గుర్రుగా ఉంది. మా అనుమతి లేకుండా చెయ్యద్దు అని చెప్పినా, జగన ముందుకు వెళ్తున్నారు అనే కోపం ఉంది. అందుకే జగన దూకుడుకు బ్రేకులు వెయ్యటానికి, జగన్ ఢిల్లీలో ఉండగానే, పోలవరం ప్రాజెక్ట్ పై షోకాజ్ నోటీసులు ఇవ్వటం సంచలనంగా మారింది. ఒక పక్క వెంకయ్య మాటలు, మరో పక్క జగన్ హావభావాలు చూస్తుంటే, ఈ సారి ఢిల్లీ టూర్ లో జగన్, అనుకున్నది దక్కలేదు అనే వాతావరణమే కనిపిస్తుంది.