జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓవర్ ఆక్షన్ కి అవార్డు ప్రకటించారు, తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి హనుమంతరావు... పవన్ చేస్తున్న ఓవర్ ఆక్షన్ భరించలేక, ఆయన చేస్తున్న కెసిఆర్ ఫ్యామిలీ భజన చూడలేక ఈ అవార్డు ప్రకటించినట్టు చెప్పారు. పవన్ కళ్యాణ్ ఒక్కడికే కాదు, తెలంగాణ మంత్రి కేటీ రామారావుతో కలిపి, ఈ అవార్డు ఇవ్వాలని అన్నారు. కేటీఆర్ కు, పవన్‌కల్యాణ్‌కు బూతు సాహితీ అవార్డు ఇవ్వాలని, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఇద్దరూ బూతులు మాట్లాడటంలో సిద్ధహస్తులని, ఇలాంటి వారికి ఇలాంటి అవార్డులే ఇవ్వాలని అన్నారు. శనివారం మీడియా ప్రతినిధులతో, వీహెచ్ ఈ వ్యాఖ్యలు చేసారు.
నాతో పోల్చుకుంటే, లోకేష్ కు అనుభవం ఏమి ఉంది, అని మొన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పై కూడా వీహెచ్ స్పందించారు. లోకేష్ కన్నా పవన్‌కల్యాణ్‌కు ఎక్కువ అనుభవం ఉందా అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యెక హోదా విషయంలో, మోడీ మాట మార్చారని, కాంగ్రెస్ పార్టీ అలా చెయ్యదని, తెలంగాణా ఇస్తామని ఎలా చెప్పి ఇచ్చామో, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు అడ్డు పడిన కేసిఆర్ కు తెలంగాణలోని ఆంధ్రులు బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. మోడీ భజనలో కెసిఆర్ మునిగితేలుతున్నారని, అలాంటి ఫ్యామిలీని పవన్ భజన చెయ్యటం ఆపాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వాలని చెప్పిన ఎంపీ కవిత.. బిల్లు ప్రవేశపెట్టిన రోజున సభకు హాజరవ్వలేదని వీహెచ్ అన్నారు. ఇలాంటి కవితకు, చెల్లలు కవితకు ధన్యవాదాలు అని పవన్ చెప్పటం, కెసిఆర్ ఫ్యామిలీకి ఎంత భజన చేస్తున్నాడో అర్ధమవుతుందని అన్నారు. ఇంతకు ముందు అనేకసార్లు పవన్, కెసిఆర్, కేటీఆర్ భజన చేసిన సంగతి తెలిసిందే. కెసిఆర్ పరిపాలన అద్భుతం అంటూ, కెసిఆర్ ఇంటికి వెళ్లి మరీ పొగిడి, చంద్రబాబుకు పరిపాలనకు 2 మార్కులు, కెసిఆర్ పరిపాలనకు 6 మార్కులు అని చెప్పారు. అలాగే అనేక సందర్భాల్లో కేటీఆర్ ను పొగుడుతూ, లోకేష్ ని హేళన చేస్తున్న సంగతి తెలిసిందే.