ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మూడు రాష్ట్రాలు ఉండొచ్చు ఏమో, అమరావతి లెజిస్లేటివ్ కాపిటల్, విశాఖపట్నం ఒక కాపిటల, కర్నూల్ ఒక కాపిటల్ అంటూ, జగన్ మోహన్ రెడ్డి, మొన్న జరిగిన అసెంబ్లీ చివరి రోజున ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో, మొత్తం కన్ఫ్యూషన్ లో పడేసారు. ఎవరికి వారికి, ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. ప్రాంతాల వారీగా ప్రజలను విడదీసే ఈ నిర్ణయం, ఇప్పటికే ప్రజల పై కొంత ప్రభావం చూపించింది. ఏ ప్రాంతం ప్రజలు ఆ ప్రాంతం కావలి అంటూ, వ్యాఖ్యలు చేస్తూ, వేరే ప్రాంతం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కోసం, అమరావతిలోని 29 గ్రామాల ప్రజలు, రాజధాని కోసమని స్వచ్చందంగా భూములు ఇచ్చారు. ఒక్క పిలుపుతో 33 వేల ఎకరాలు రైతులు ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తుతో పాటు, తమ భవిష్యత్తు కూడా బాగుటుందని అప్పట్లో భూములు ఇచ్చారు రైతులు.
ఇప్పుడు ఈ రైతులు రోడ్డున పడ్డారు. జగన్ నిర్ణయంతో, గత మూడు రోజులుగా అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం వెనక్కు తీసుకునే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని, వారు ఆందోళన బాట పట్టారు. ఆత్మహత్యలు చేసుకోవటం తప్ప, తమకు వేరే మార్గం లేదు అంటూ, అమరావతి రైతులు రోడ్డున పడి, ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పై, అన్ని వైపుల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతుంది. తెలంగాణకు చెందినా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, వీ హనుమంత రావు, స్పందించారు. ఆయన జగన్ తీసుకున్న మూడు రాజధానుల విషయం పై, ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మూడు రాజధానుల వల్ల, ఆ రాష్ట్రానికి మరింత నష్టం తప్ప, పైసా లాభం లేదని వాపోయారు. ఇప్పటికే అమరావతిలో అన్నీ కట్టి, ఇప్పటికే అనేక భవనాలు కట్టి ఉంటే, ఇప్పుడు మళ్ళీ కొత్త రాజధాని అంటూ, తీసుకున్న నిర్ణయం, ప్రజాధనం వృథా అవడమే తప్ప ఉపయోగం లేదన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఒక రాజధానినే మేము కట్టలేము అన్నారని, ఇప్పుడు మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని ఆయన ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల పై దృష్టి పెట్టకుండా, ఈ గోల ఏంటి అని అన్నారు. జగన్ ను, కేంద్ర ప్రభుత్వం, నియంత్రించాలని అన్నారు. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్, ఇద్దరూ , ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, ఇష్టం వచ్చినట్టు ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు.