ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూల్చివేతల కాలం నడుస్తుంది. మొన్నటి దాక అన్ని కట్టడాలు కట్టం చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కూల్చివేతలు చూసి బాధపడుతున్నారు. ప్రతిపక్ష హోదాలో తనకు ప్రజా వేదిక కేటాయించాలని చంద్రబాబు కోరారు. అయితే, చంద్రబాబు లేఖకు కనీసం స్పందించని ప్రభుత్వం, రాత్రికి రాత్రి ప్రజా వేదికను కూల్చేసింది. కేవలం చంద్రబాబు మీద కక్షతో, బంగారం లాంటి బిల్డింగ్ ను పడేసిన జగన్ మనస్తత్వం పై, ఏపి ప్రజలు కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు. ఇప్పుడు తెలంగాణా కాంగ్రెస్ నేతలు కూడా జగన్ నిర్ణయాల పై తీవ్రంగా స్పందిస్తున్నారు. వైఎస్ జగన్ నిర్ణయాల పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఫ్యాక్షనిస్టుగా వ్యవహరించవద్దు అంటూ తీవ్రంగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజీవ్ మెమోరియల్ భవన్‌ను కూల్చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. జగన్ నిర్ణయం పై వీహెచ్ స్పందిస్తూ, జగన్ నిర్ణయాలు ఫ్యాక్షన్ ఆలోచనకు అద్దం పడుతోన్నాయని వీహెచ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ పుణ్యమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు, పీసీసీ చీఫ్ అయ్యారని, సోనియా గాంధీ దయ ఉండబట్టే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారనే విషయాన్ని, జగన్ మొహన్ర్ ఎద్ది గుర్తుంచుకోవాలని అన్నారు. రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు మంచిది కాదని, ఇవాళ అధికారం ఉండచ్చు, రేపు పోవచ్చు అని అన్నారు. ఇలా ఏది కనిపిస్తే అది కూల్చివేయటం పై కాకుండా, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా, జగన్ పరిపాలన చేస్తే, ప్రజలకు బాగుంటుందని అన్నారు.