బెంగుళూర్ లో దొరికిన డ్రగ్స్ కేసు రోజుకొక కీలక మలుపులు తిరుగుతుంది. నిన్న బెంగుళూరుకు వచ్చిన పార్సిల్ విజయవాడ నుంచి పంపించినట్టు పోలీసులు తెలిపారు. అక్కడ బెంగుళూరులో కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకొని , ఆ కొరియర్ బాయ్ తేజాని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో సాయి గోపి అనే యువకుడు పేరు మీద విజయవాడ లో పార్సిల్ చేసినట్టు అతను సమాచారం ఇచ్చాడు. తేజ ఇచ్చిన సమాచారం ప్రకారం సియి గోపి అనే వ్యక్తి గత రాత్రి అదుపులోకి తీసుకుని , అతన్ని పూర్తి స్థాయి లో విచారించారు. అయితే ఈ విచారంలో ఈ పార్సిల్ కు తనకు ఎటువంటి సంబంధం లేదని , అదార్ నంబర్ , అడ్రెస్ తనదేకాని , అందులో ఉన్న ఫోటో మాత్రం తనది కాదని విచారణలో చెప్పినట్టు సమాచారం. తన ఆదార్ నెంబర్ తో ఫేక్ వి సృష్టించి ఎవరోవాడుకున్నారని , తనకు ఈకేసుకు తనకు ఎటువంటి సంబంధం లేదని ,అసలు నిందితులను పోలీసులే పట్టుకోవాలని గోపి విచారణలో పోలీసులను కోరినట్టు సమాచారం. ఆవిచారణ తరువాత పోలీసులు అతనిని పంపించేసారు. అ తరువాత గోపి సత్తెనపల్లి రూరల్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. తన ఆధార కార్డ్ ను ఎవరో మార్ఫింగ్ చేసారని , డ్రగ్స్ రవాణా చేసేందుకు పార్సిల్ కేంద్రం లో తన ఆధార ఎవరో వాడారని , అది ఎవరో కనిపెట్టి, కఠిన చెర్యలు తీసుకువాలని సాయి గోపి సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.
విజయవాడ డ్రగ్స్ కేసులో కీలక మలుపు...
Advertisements