ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. మొత్తం 8 కమిటీలను, పలు అనుబంధ కమిటీలను ఏర్పాటు చేశారు. జగన్ కు వీర విధేయుడిగా ఉంటూ వచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డిని చైర్మన్‌గా , అధ్యక్షుడిగా ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, ప్రధాన కార్యదర్శిగా పురుషోత్తం ఎన్నికయ్యారు. ఈసందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. తనకు ఎమ్మెల్యేగా కంటే క్రీడాకారుడు గానే చెప్పుకోచటం ఇష్టమన్నారు. నిజాయితీగా పని చేసే జగన్ ప్రభుత్వం వచ్చిందని..ఇక క్రీడల అభివృద్ధికి పని చేయాల్సి ఉందన్నారు. ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి క్రీడల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు. మిగిలిన గొడవలు అన్నీ వదిలేసి.. క్రీడల అభివృద్ధి పైన దృష్టి పెట్టాలని కొత్త కమిటీలకు ఆయన సూచించారు.
ఆ తర్వాత మాట్లాడిన ప్రధాన కార్యదర్శి పురుషోత్తం … హైదరాబాద్ లోని ఒలింపిక్ భవన్ కబ్జాలో ఉందని ఆరోపించారు. దాని సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామన్నారు. విజయసాయిరెడ్డి త్వరలో గుంటూరులో ఎపి ఒలింపిక్ భవన్ నిర్మాణం చేపడతామని హమీ ఇచ్చారు. కోచ్‌ల కోరతను కూడా తీరుస్తామన్నారు. క్రీడా సంస్కృతిని పెంపొందించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దేశంలో ఏపిని స్పోర్ట్స్ లో నెంబర్ వన్ గా తీర్చుదిద్దుతామని హామీ ఇచ్చారు.