ఎంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చినట్లు అనే సామెత మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు విజయమ్మ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒక పక్క కొడుకు, ఒక పక్క కూతురు, ఎవరి వైపు ఉండి, ఏమి మాట్లాడినా అది రివర్స్ కొడుతుంది. ఆమె పరిస్థితి ఇలా మారిపోవటంతో, ఆమె ఎవరికి సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితిలో మౌనంగా ఉంటున్నారు. విజయమ్మ కుమార్తె షర్మిల, తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తాను అంటూ, కొత్త పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి ఆమెకు అన్యాయం చేసారని, అందుకే పార్టీ పెట్టి, రాజకీయంగా బలపడాలి అనుకుంటున్నారు అనే వారు కూడా ఉన్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే, షర్మిల , ఉద్యోగాల కోసం అంటూ దీక్ష చేసారు. తరువాత పోలీస్ పర్మిషన్ లేకపోయినా పాదయాత్ర చేస్తూ లోటస్ పాండ్ వెళ్ళాలి అనుకోవటంతో, పోలీసులు ఆమెను నియంత్రించారు. ఈ సమయంలో జరిగిన తోపులాటలో, షర్మిల జాకీట్ చెరిగి, ఆమె చేయకు కూడా గాయం అయ్యింది. అయితే ఈ సందర్భంగా మాట్లాడిన తల్లి విజయమ్మ, షర్మిల కు జరిగిన పరాభవం పై స్పందిస్తూ, న్యాయం అడగటం కూడా తప్పా, ఆడవారు అని కూడా చూడకుండా, ఇలా చేస్తారా అంటూ, విజయమ్మ కేసీఆర్ సర్కార్ పై మండి పడ్డారు. ఆమె ఆవేదనతో మాట్లాడారు.
అయితే సరిగ్గా ఇదే విషయం పై, ఆంధ్రప్రదేశ్ లో, జగన్ బాధితులు అందరు విజయమ్మ పై విరుచుకు పడ్డారు. ఇక్కడ నీ కొడుకు కూడా, కేసీఆర్ కంటే గొప్పగా ఏమి చేయటం లేదని విమర్శలు సంధించారు. ముఖ్యంగా అమరావతి ప్రాంత మహిళా రైతులు, మేము కూడా ఆడవరిమే అని, మేము కూడా నీ కూతురు లాంటి వాళ్ళమే అని, ఇక్కడ మీ కొడుకు రాక్షసత్వం గురించి, మీకు తెలియదా అని ప్రశ్నించారు. ముందు మీకు ఇక్కడ బాధ్యత ఉందని, ఇక్కడ గతంలో ఓట్లు అడిగిన మీరు, ఇప్పుడు గెలిచిన తరువాత మా గురించి పట్టించుకోకుండా, తెలంగాణాలో ఏదో ఉద్దరిస్తాం అని చెప్పటం, తెలంగాణా వాళ్ళు ఎలా నమ్ముతారు అంటూ, ఆగ్రహం వ్యక్తం చేసారు. విజయమ్మ గారు, ముందు తన కొడుకు చేస్తున్న అరాచకాలు ప్రశ్నించాలని, షర్మిల కూడా ఇక్కడ వచ్చి, జగన్ బాధితుల కు అండగా నిలవాలని, విజయమ్మ కూడా తన కొడుకుకి, వేదించకుండా, సవ్యంగా పరిపాలన చేయాలని ఆదేశాలు ఇవ్వాలి అంటూ, ఆగహ్రం వ్యక్తం చేసారు.