ఈ వైసిపీ పార్టీకి విజయవాడ ప్రజలు ఒకరకంగా కూడా కనిపించటం లేదు... రోజుకి ఒక డ్రామా ఆడుతూ, ప్రజలని పిచ్చోళ్లని చేస్తూ, నిజం అనుకునే లోప అబద్దం అంటారు, అబద్దం అనుకుంటే నిజం అంటారు... అసలు ఎవరు ఎవరి పక్షమో అర్ధం కాక, ఇటు ప్రజలు, అటు కార్యకర్తలు జుట్టు పీక్కుంటున్నారు... మొన్నటి మొన్న పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు అంటూ డ్రామా ఆడిన గౌతంరెడ్డి, వైఎస్ జగన్ ను పాదయత్రలో కలవటం సంచలనం అయ్యింది... వంగవీటి రంగాను చంపడం తప్పు కాదు అంటూ, వైఎస్ జగన్ దగ్గరి బంధువు, గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలతో, కాపుల ఆగ్రహానికి గురై, గౌతంరెడ్డిని పార్టీ నుండి సస్పెన్షన్ చేస్తున్నాం అంటూ, అప్పట్లో వైసీపీ డ్రామా ఆడింది...
మొన్న, అది నిజంగానే డ్రామా అని తేలిపోయింది... కేవలం అప్పట్లో రాధాను బుజ్జగించటానికే అప్పట్లో డ్రామా ఆడారు అనే విషయం ఇప్పుడు తేలిపోయింది... తరువాత వరుస పెట్టి గౌతం రెడ్డి వైసిపి పార్టీ తరుపున న్యూస్ చానల్స్ లో విశ్లేషకుడిగా వెళ్లారు... సస్పెండ్ అయిన వ్యక్తీ, సస్పెండ్ చేసిన పార్టీ అధ్యక్షుడిని కలవటం ఒక వింత అయితే, అదే సస్పండ్ అయిన నాయకుడు, టీవీ చర్చల్లో కూడా వెళ్ళిపోయారు... ఇక అందరు గౌతం రెడ్డి వైసిపీ పార్టీలో వెళ్ళిపోయాడు అనుకున్నారు... గౌతం రెడ్డి కూడా, నాకు ఇప్పటి వరకు సస్పెండ్ చేసినట్టు, ఒక్క లెటర్ కూడా రాలేదు అని తేల్చి చెప్పారు...
మళ్ళీ ఏమైందో ఏమో, నిన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి హోదాలో విజయసాయిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేసారు... గౌతమ్‌రెడ్డి టీవీ చర్చల్లో పాల్గుంటూ చెప్తున్న అభిప్రాయాలతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని, ఆయన తమ పార్టీ సభ్యుడు కూడా కాదని, ఆయన్ను సస్పెండ్ చేసాం అని విజయసాయిరెడ్డి ప్రకటనలో తెలిపారు. అయితే గౌతం రెడ్డి మాత్రం, తనను సస్పెండ్ చేసినట్టు కూడా ఎలాంటి సమాచారం పార్టీ అధిష్టానం నుంచి నేటికీ అందలేదని గౌతమ్‌రెడ్డి మరోసారి గుర్తుచేశారు. జగన్ ను మొన్న కలిసినప్పుడు, పార్టీ కోసం కష్టపడమన్నారని అని గౌతం రెడ్డి చెప్పారు... అసలు ఇన్ని ప్రకటనలు, ఇన్ని డ్రామాల మధ్య, మేమేన్నా పిచ్చోళ్ళు లాగా కనిపిస్తున్నామా, అంటూ విజయవాడ ప్రజలు అంటున్నారు...