ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై తన అభిప్రాయం, కేసులు మాఫీ కోసం ఆడుతున్న డ్రామాలు, ఇలా ప్రతి విషయంలో చేస్తున్న నయవంచనతో జగన్ ను వదిలి అందరూ వచ్చేస్తున్నారు... ఇటు పట్టిసీమ దండగ అంటూ, కృష్ణా జిల్లా రైతాంగం ఆగ్రహానికి గురై, అలాగే సీమకు నీళ్ళు ఇస్తున్న పట్టిసీమ దండగ అంటూ, అక్కడ రైతాంగం ఆగ్రహానికి గురై, తన విధానాలతో, తన పార్టీ నాయకులను బయట తిరగానివ్వకుండా చేస్తున్నాడు... మరో పక్క తన సెల్ఫ్ గోల్స్ తో, ప్రాంతానికి ఒక మాట మాట్లాడుతూ, ద్వంద్వ విధానాలు అవలంభిస్తూ, ఇరు ప్రాంతాలకి కాకుండా పోతున్నాడు జగన్...
మరో పక్క, జగన్ పెట్టే టార్చర్ తట్టుకోలేక మరి కొంత మంది, జగన్ కు దండం పెట్టి బయటకు వచ్చేస్తున్నారు... పాదయాత్ర చేస్తున్నా, ప్రజల్లో ఏ మాత్రం గ్రాఫ్ పెరగటంలేదు.. వలసులు జరుగుతూనే ఉన్నాయి.. దీంతో, రేపు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి... మరో నాలుగురు ఎమ్మల్యేలు పార్టీ మారితే రాజ్యసభ సీటు వచ్చే అవకాసం లేదు... మరో పక్క, మరో 15 మంది ఎమ్మల్యేలు జగన్ కు నమస్కారం పెట్టేస్తారు అనే వార్తలు వస్తున్నాయి... దీంతో విజయసాయి రెడ్డి రంగలోకి దిగారు...
ప్రధాన ఎన్నికల కమిషనర్ ని కలిసి, ఏపీ ప్రభుత్వం దగ్గర ఉండి, మా ఎమ్మల్యేలను లాగేస్తుంది అని, మరో నలుగురు ఎమ్మల్యేలు వెళ్ళిపోతే మాకు రాజ్యసభ సీటు పోతుంది అని, అందుకే కేంద్ర బలగాలతో తమ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని కోరారు... రాజ్యసభ ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ లను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని, అమరావతిలో వద్దు అంటూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేసారు విజయసాయి... ఇలా వింతంగా ఫిర్యాదు రావటంతో, ఎన్నికల కమిషన్ కూడా అవాక్కయినట్టు సమాచారం... వేరే రాష్ట్రంలో ఎన్నికలు పెట్టమనటం, ఎమ్మల్యేలకు సెంట్రల్ ఫోర్సు తో సెక్యూరిటీ పెట్టాలని అనటం, ఎప్పుడూ ఎవరూ కోరలేదు అని అంటున్నారు...