దొంగలు దొరికారు. కాకపోతే అందరి దొంగలు లాగే, ఈ దొంగాలు కూడా, జైలుకు వెళ్లి వచ్చినా, బుద్ధి రాలేదు. బెయిల్ పై బయట తిరుగుతూ, తమ దొంగ బుద్ధి చూపించారు. తాను రాసుకున్న దొంగ స్కెచ్, పొరపాటున ఎలక్షన్ కమిషన్ కు పంపించి దొరికిపోయాడు. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు బయట పెట్టారు. ఐటీ గ్రిడ్స్ కంపెనీ విషయంలో తెలంగాణ పోలీసులు అతిగా ప్రవర్తించారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి డైరెక్షన్ లో తెలంగాణ పోలీసులు డ్రామాను కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగలు ఎంత దొంగతం చేసినా, చిన్న ఆధారం వదిలేస్తారని, ఆ ఆధారమే, విజయసాయి రెడ్డిని ఇప్పుడు పట్టించింది.
విజయసాయి రెడ్డి 19.02.2019న ప్రధాన ఎన్నికల అధికారికి ఒక వినతి రాశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ - ఇల్లీగల్ యాక్సిస్ టు డిజిటల్ డేటా ఆఫ్ ఇండివిడ్యువల్స్ బై తెలుగుదేశం పార్టీ-కంప్లయింట్-యాక్షన్-రిగార్డింగ్ ’’ పేరుతో వినతి రాశారు. ఆ వినతిని తయారు చేసింది ఫిబ్రవరి 19న అయితే ఈసికి ఇచ్చింది ఫిబ్రవరి 22న. ఫిబ్రవరి 19న విజయసాయి రెడ్డి ఇచ్చిన వినతిలోనే కుట్రకు స్కెచ్ ఉంది. కుట్రకు కార్యాచరణ ప్రణాళిక రాశారు. వినతికి అనుబంధంగా కుట్ర యాక్షన్ ప్లాన్ కూడా ఈసికి అందించారు. రాసుకున్న స్కెచ్ కూడా ఈసికి వినతిలో జత చేశారు. అక్కడే దుష్టచతుష్టయం మహాకుట్ర బైటపడింది. ఈ కుట్ర ‘బాహుబలి’ కుట్రలను మించిపోయింది. ఈసికి ఇచ్చిన వినతిలో యాక్షన్ పాయింట్స్, టాకింగ్ పాయింట్స్ కూడా పొరపాటున పెట్టి ఇచ్చారు.
సోదాల్లో ఐటి గ్రిడ్ ఆఫీసులో ఏం చేయాలి..? ఎవరెవరిని ఎలా ఇబ్బందులు పెట్టాలి..? కుట్ర స్కెచ్ యాక్షన్ ప్లాన్‌లో అన్నీ రాశారు. దేశం ముందు ఈ సాక్ష్యాధారాలను చంద్రబాబు ఉంచారు. దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలే వీళ్లను చీత్కరించాలి. ‘‘ప్లాన్ ఆఫ్ యాక్షన్’’ అంతా అందులో రాసుకున్నారు-సెర్చ్, ఎఫ్ ఐఆర్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, డేటా సీజ్ చేయడం, ఉద్యోగుల సెల్ ఫోన్లు లాగేసుకోవడం, వేధింపులు-బెదిరింపులు,సేవామిత్ర యాప్ ను డిజేబుల్ చేయడం, సేవామిత్ర కీలక కార్యకర్తలను గుర్తించి బెదిరించడం, కోర్ట్ ద్వారా సిబిఐ విచారణ కోరడం, నేషనల్ మీడియా అటెన్షన్ డ్రా చేయడం, సిఈవోకు, ఉడాయ్ కు లెటర్స్ పంపాలని అనడం, ఐటి గ్రిడ్ కంపెనీపై సోదాలపై అల్లరి చేయడం.... అంతా ‘‘ ప్రి-ప్లాన్డ్ కాన్స్ఫిరసి’’. కొందరు మంత్రులను కూడా టార్గెట్ చేయాలని రాశారు. ఉన్నతాధికారులను, తెలుగుదేశం నేతలను టార్గెట్ చేయాలని రాశారు. దేశ చరిత్రలో ఇంత మహాకుట్ర చూడలేదు, వినలేదు.