ఢిల్లీ పెద్దల పాదాలు కనిపిస్తే చాలు, A1, A2 వాలిపోతున్నారు.. A1కు పాదయాత్రలో ఉండి, ఢిల్లీ పెద్దలను కలిసే ఛాన్స్ లేక కాని, లేకపోతే రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సమయంలో రామ్ నాథ్ కోవింద్ పై ఎలా పడ్డాడో చూసాం.. ఇక A2 గారి సంగతి అయితే చెప్పేది ఏముంది, ప్రత్యేక్షంగా ఒక 10 సందర్భాలు అయినా చూసి ఉంటాం... ఒక ఇద్దరు ఆర్ధక నేరగాళ్ళు, 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసుల్లో A1, A2, 16 నెలలు జైలుకి వెళ్లి వచ్చి, బెయిల్ పై బయట తిరుగుతున్న వీళ్ళు, అవలీలగా వెళ్లి ఒక దేశ ప్రధానిని కలుస్తూ, ప్రాధాన మంత్రి ఆఫీస్ లోనే ఉంటూ, రాష్ట్రం పై ఎలాంటి కుట్రలు పన్నుతున్నారో చూస్తూనే ఉన్నాం... అయితే, ఇప్పుడు కాకా పట్టటంలో మన A2 గారు కొత్త రకంగా ప్లాన్ చేసారు.

vijayasar 02072018 2

విజయసాయి రెడ్డి ఓ పుస్తకం రాశారు.. అవాక్కయ్యారా ? లక్షల కోట్లు ఎలా సంపాదించాలి, దొంగ కంపంలీ ఎలా పెట్టాలి అనే పుస్తకాలు కాదు అండి... ఆయన రాసిన పుస్తకం సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిపైన. తాను వెంకన్నపై ఓ పుస్తకాన్ని రాసినట్లు విజయసాయి స్వయంగా ట్విట్టర్లో ప్రకటించారు. ‘గ్లోరీ ఆప్ లార్డ్ వెంకటేశ్వర’ అనే పేరుతో ఈ పుస్తకాన్ని తెలుగు, ఇంగ్లీషు, హిందీ, గుజరాతీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తానని ట్వీట్ చేశారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ అంటే అర్ధం చేసుకోవచ్చు, గుజరాతీ భాషలో కూడా పుస్తకం ఎందుకు అనే అనుమానాలు వస్తున్నాయి. మరాఠీ నుంచి చాలా మంది వెంకన్న భక్తులు ఉన్నారు, పక్కన తమిళనాడు అయితే చెప్పే పనే లేదు. అలాగే ఇంకా అనేక భాషలు ఉండగా, విజయసాయి రెడ్డి, గుజరాతీ ప్రాంతీయ భాషలోనే పుస్తకం రాసారు.

vijayasar 02072018 3

ఎందుకో చెప్పే పని లేదు అనుకుంటా... ఈ విధంగా, గుజరాత్ బాస్ ని కాక పట్టే ప్రయత్నం చేస్తున్నాడు. గుజరతీలో రాయటం వెనుక మరో కారణం కూడా ఉంది. ఈ పుస్తకాన్ని, ప్రధాని మోడీ చేత ఆవిష్కరించే ప్లాన్ వేసాడు అని ఢిల్లీ వర్గాల టాక్.. ప్రధానికి ఇప్పటికే ఈ విషయం తెలుపుగా, ఆయాన కూడా సరే అన్నట్టు తెలుస్తుంది. తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలు మన ప్రధానికి కనపడవు కాని, A2 రాసిన పుస్తకం మాత్రం విడుదల చేస్తారంట... ఆయినే, 16 నెలలు జైలుకి వెళ్లి వచ్చి, బెయిల్ పై బయట తిరుగుతున్న వాడికి, ప్రధాని స్థాయి వ్యక్తి ప్రోత్సహిస్తున్నాడు అంటే, ఇంకా ఏమి చెప్పాలి ? మరో పక్క, దీనిలో రాజకీయం కూడా జోడించారనే ప్రచారం జరుగుతుంది. తిరుమల చుట్టూ ఇటీవల జరిగిన వరుస వివాదాలు, విజయసాయి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, రమణ దీక్షితులు వివాదం వంటి పరిణామాల తర్వాత ఆయన ఈ పుస్తకాన్ని తీసుకువస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read