నిన్న వెంకయ్య నాయడు పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తా అని చెప్పిన విజయసాయి, ఈ రోజు కూడా తన రంగు మరో సారి బయటపెట్టారు... నిన్న కేంద్ర మంత్రి సుజాన చౌదరి ప్రసంగిస్తూ, విభజన హామీల పై కేంద్రం అన్యాయం చేస్తుంది అని, ఇన్ని రోజులు నుంచి ఆందోళన చేస్తున్నా, కేంద్రం స్పందించలేదు అంటూ ప్రసంగించారు... అయితే సుజనా చౌదరికి ఒక ఆంధ్రా ఎంపీగా సపోర్ట్ చెయ్యల్సింది పోయి, వైసిపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సుజనా చౌదరినే విమర్శించారు.. ఈ రోజు కూడా అలాంటి సీన్ మళ్ళీ రాజ్యసభలో రిపీట్ అయ్యింది...
రాజ్యసభలో టీడీపీ ఎంపీలు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఛైర్మన్ పొడియం వద్ద ఫ్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఎంపీల నిరసనతో లోక్‌సభను మార్చి 5కు వాయిదా వేశారు. దీంతో రాజ్యసభలో టీడీపీ ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే టీడీపీ నేతల నిరసనపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఉన్న స్పీకర్ తో, నేను మాట్లాడాలి మాట్లాడాలి అంటూ ఆందోళన చేసి మైక్ తీసుకున్నారు విజయసాయి...
అందరు ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి, కేంద్రాన్ని ఎండగడతారేమో అని అందరూ ఊహించారు... కాని విజయసాయి మోడీ మీద ఉన్న భక్తిని చాటుకున్నారు... ఎన్డీయే భాగస్వామ్యపక్షమై ఉండి.. ఎలా పోరాటం చేస్తారని ప్రశ్నించారు... ముందుగా మీరు అందరూ ఎన్డీయే నుంచి బయటకు రండి... అప్పటి వరకు ఆందోళన చెయ్యవద్దు అంటూ, వింత వాదన తీసుకొచ్చారు విజయసాయి... నిండు సభలో, ఆంధ్రప్రదేశ్ గురించి అడగకుండా, మీరు ఎన్డీయే నుంచి బయటకు రండి అనటం ఏంటో ఎవరికీ అర్ధం కావటం లేదు...