గత వారం రోజులుగా తెలంగాణా, ఢిల్లీ, జగన్, విజయసాయి రెడ్డి కలిసి హైదరాబాద్ వేదికగా జరిగిన కుట్రలను చంద్రబాబు బయట పెట్టారు. ఇది హైదరాబాద్ వేదికగా జరిగిన కుట్ర కాదు, ఢిల్లీ స్థాయిలో జరిగిన కుట్ర ఇది అంటూ చంద్రబాబు సాక్ష్యాలు బయట పెట్టారు. తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలని పెద్ద కుట్రకు తెరలేపారని చెప్పారు. ఇంత దారుణమైన కుతంత్రాలు చరిత్రలో ఎప్పుడూ లేవని విమర్శించారు. ‘బాహుబలి’ సినిమాలో చూపించిన దాని కంటే ఇది మహాకుట్ర అని అన్నారు. డేటా చోరీ వ్యవహారంపై అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రంపై కుట్రలు జరుగుతున్నాయి. చేసిన కుట్రలు బయటపడితే ప్రజలు ఛీ కొడతారని కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. తెదేపా డేటాను దొంగిలించి వైకాపాకు ఇవ్వాలని కుట్ర పన్నారు. తెదేపాను నాశనం చేయాలని చూస్తున్నారు. దుష్ట చతుష్టయం ఏమేం చేస్తున్నారో ప్రజలకు చాలా సార్లు చెప్పా. ప్రజాస్వామ్యంలో ఇంత దారుణమైన కుట్ర, కుతంత్రాలు చరిత్రలో ఎప్పుడూ లేవు. ఓ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి అధికారులే దీనికి సూత్రధారులు.’’

cbn 09032019 1

ఇవే సాక్ష్యాలు అంటూ చంద్రబాబు చెప్పిన వివరాలు... ఫిబ్రవరి 19న చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రజల డేటాను టీడీపీ చట్టవిరుద్ధంగా చోరీ చేస్తోందని కంప్లెయింట్ ఇచ్చారు. దానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతే కాదు పొరపాటున ఆ లేఖలో, ఈ విషయం పై చెయ్యవలసిన ప్లాన్ అఫ్ ఆక్షన్ రాసుకున్నారు. అది కూడా పొరపాటున ఆ లేఖలో పెట్టటంతో, వీళ్ళ కుట్ర బయట పిండి. 22వ తేదీ యాక్షన్ స్టార్ట్ చేశారు. ఆ కుట్రలో తెలంగాణ ప్రభుత్వం కూడా భాగస్వామి అయింది. 23వ తేదీ ఐటీ గ్రిడ్ సంస్థ మీద దాడులు చేశారు. ఎవరూ ఫిర్యాదు చేయకుండానే డైరెక్టుగా ఆ సంస్థలో తనిఖీలు చేశారు. ఇది చట్టవిరుద్ధం. ఆ సంస్థలో టీడీపీకి సంబంధించిన సమాచారాన్ని పట్టపగలు దోపిడీ చేశారు. ఐటీ గ్రిడ్ డైరెక్టర్ అశోక్ కుటుంబాన్ని వేధించారు. ఐటీ గ్రిడ్ మీద దాడులు చేసిన తర్వాత వారం రోజులకు మార్చి 2వ తేదీ అర్థరాత్రి 12.05 గంటలకు డేటా పోయిందని ఫిర్యాదు ఇచ్చారు. అర్థరాత్రి డేటా పోయిందని ఎవరైనా ఫిర్యాదు చేస్తారా? ఏపీ డేటా పోయింది కాబట్టి మాకు సమాచారం ఇవ్వాలి కదా?

cbn 09032019 1

తెల్లకాగితాల మీద వీఆర్‌ఓల సంతకాలు ఎందుకు తీసుకున్నారని కోర్టు ప్రశ్నించిన విషయాన్ని ఎందుకు బయటపెట్టడం లేదు? మార్చి 4న సైబరాబాద్ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 23వ తేదీన ఐటీ గ్రిడ్ మీద సోదాలు చేశామని చెప్పలేదు. మార్చి 7న సిట్ ఏర్పాటు చేశారు. సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర మాత్రం 23వ తేదీ ఐటీ గ్రిడ్‌లో తనిఖీలుచేశామని ఒప్పుకున్నారు. అసలు ఫిర్యాదు లేకుండా ఐటీ గ్రిడ్ మీద దాడి ఎందుకు చేశారు? మార్చి 2,3,4 తేదీల్లో విజయసాయిరెడ్డి హైదరాబాద్‌లోనే ఉన్నారు. విజయసాయిరెడ్డి దర్శకత్వంలో, సీఎం ఆఫీసు సూచనలతో జరిగిన దాడి. మల్టీ విలన్ క్రిమనల్. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం, దగా, నిర్వీర్యం చేశారు. జగన్, విజయసాయిరెడ్డి, కేసీఆర్, కేటీఆర్, మోదీ, అమిత్ షా అందరూ ఉన్నారు. డేటా చోరీ మీరు చేసి మళ్లీ టీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ నాయకులు వెళ్లి గవర్నర్‌ను కలుస్తారా? అందరూ ఒకే పల్లవి పాడుతున్నారు. ముందస్తుగా కుట్ర చేసి, దాన్ని సర్దిచెప్పుకోవడానికి మళ్లీ తప్పు చేస్తున్నారు. తెలంగాణలో పింఛన్లు ఇస్తే తప్పులేదు. వైసీపీ రూ.2వేలు ఇస్తానంటే తప్పులేదు. మేం ప్రభుత్వం తరఫున అధికారికంగా ప్రజలకు మేలు చేస్తుంటే కడుపుమంటా?

Advertisements

Advertisements

Latest Articles

Most Read