విజయసాయి రెడ్డి... ఈయనంటే తెలియని వారు ఎవరూ ఉండరు. వైసీపీ పార్టీలో, జగన్ మోహన్ రెడ్డి తరువాత స్థానం ఆయనదే. పార్టీలోనే కాదు, పార్టీ పెట్టక ముందు నుంచి, విజయసాయి రెడ్డి, వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు. రాజశేఖర్ రెడ్డి సియంగా ఉండగా, ఆ కుటుంబ ప్రాధాన ఆడిటర్ గా, ఆయన చేసిన పనులకు, జగన్ తో పాటుగా కేసుల్లో కూడా ఇరుకున్నారు. జగన్ తో పాటుగా, జైలు జీవితం కూడా అనుభవించి, ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి విజయం సాధించటంలో, విజయసాయి పాత్ర చాలా కీలకం అని చెప్తూ ఉంటారు. ఆయన ఢిల్లీలో కూర్చుని చేసిన రాజకీయం, బీజేపీకి టిడిపికి గ్యాప్ తీసుకు రావటం, అదే సమయంలో వైసీపీకి దగ్గర చెయ్యటం, ఎన్నికల్లో కేంద్ర సహకారం తీసుకోవటం, అలాగే తమ కేసులు స్పీడ్ అవ్వకుండా చూడటం, ఇలా అన్ని విషయాల్లో విజయసాయి రెడ్డి సూపర్ సక్సెస్ అయ్యారని, వైసీపీ నేతలు చెప్పుకుంటూ ఉంటారు.
జగన్ పాదయాత్ర ఎంత ముఖ్యమో, ఢిల్లీలో విజయసాయి చేసే లాబీ కూడా అంటే ముఖ్యం అని చెప్పే వారు. జగన్ కూడా, విజయసాయి రెడ్డికి అధిక ప్రాధాన్యత ఇచ్చే వారు. ఆయనకు దాదపుగా నాలుగు పదవులు కూడా ఇచ్చారు. అందులో ముఖ్యమైంది, ఢిల్లీలో ప్రత్యెక ప్రతినిధిగా. విజయసాయి రెడ్డి ఎంత ముఖ్యమో చెప్పకనే చెప్పారు జగన్. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డికి ప్రాధాన్యత తగ్గిపోయింది అనే వార్తలు వస్తున్నాయి. దీనికి వైసీపీ నేతలే సాక్ష్యం అని కూడా అంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందులు గురించి వైసీపీ ప్రజా ప్రతినిధులు, విజయసాయి దగ్గర గోడు చేపుకున్నారు. ఇసుక కొరతతో ప్రజలు అల్లాడుతున్నారని, ప్రతిపక్షాల పై కక్ష సాధింపు మరీ ఎక్కువైందని, రేపు పార్టీ అధికారం పొతే, వాళ్ళు కూడా మమ్మల్ని అలాగే వెంటాడుతారని, కొంచెం స్పీడ్ తగ్గించాల్సిందిగా చెప్తూ, జగన్ కు చెప్పమని, విజయసాయి దగ్గర చెప్పుకొచ్చారు.
విజయసాయి కొంచెం ధైర్యం చేసుకుని, ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు, వాటికి తక్షణం చెయ్యవలసిన పని గురించి చెప్తూ ఉండగా, జగన్ వైపు నుంచి వచ్చిన సమాధానం చూసి, విజయసాయి సైలెంట్ అయిపోయారు అంటూ కధనాలు వచ్చాయి. మిమ్మల్ని ఢిల్లీలో చూసుకోమన్నానుగా, ఆంధ్రప్రదేశ్ విషయాలు నాకు వదిలేయండి అంటూ, సుతి మెత్తగా చెప్పారంట జగన్. అలాగే విజయసాయి ప్రెస్ తో మాట్లాడుతూ, మేము చేసే అన్ని పనులకు, మోడీ, అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని చెప్పటం, ఢిల్లీ పెద్దలకు కోపం రావటం, జగన్ వెళ్లి వారికి సంజయషీ ఇవ్వటం కూడా, జగన్ మనుసులో పెట్టుకుని, ఏపి విషయాలు మీరు వదిలేయండి అని చెప్పటంతో, విజయసాయి రెడ్డి అప్పటి నుంచి ట్విట్టర్ లో బిజీ అయిపోయారు అని చెప్తున్నారు. ఇక పార్టీలో నెంబర్ 2,3 లేదని, అంతా జగనే అని, ఇప్పుడు ఆయనకు ఏదైనా ఫీడ్ బ్యాక్ ఇవ్వాలి అంటే, ఎవరితో చెప్పాలో కూడా తెలియని పరిస్థితి అని, వైసీపీ నేతలు వాపోతున్నారు.