నిన్న ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా, గత 20 ఏళ్ళలో లేని విధంగా, దారుణంగా పాస్ పెర్సెంటేజ్ పడిపోయింది. దీని పైన జగన్ మోహన్ రెడ్డి పై అనేక విమర్శలు వస్తున్నాయి. పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి అని విమర్శలు వస్తున్నాయి. కొత్త టీచర్లను తీసుకోకపోవటం, ఉన్న టీచర్లను మద్యం షాపుల దగ్గర డ్యూటీలు వేయటం, విద్యా ప్రమాణాలు పెంచకుండా, రంగులు వేయటం పైనే శ్రద్ధ పెట్టటం, ఇలా అనేక కారణాలు, దీనికి కారణం అయ్యాయి. అయితే ప్రభుత్వం, ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోకుండా, పదవ తరగతి ఫలితాలు అలా రావటానికి చంద్రబాబు కారణం అంటూ టిడిపి మీద తోసేసింది. విజయసాయి రెడ్డి ట్వీట్ చేస్తూ, నారాయణ స్కూల్ లో పేపర్ లీక్ చేసి, టిడిపి రాద్ధాంతం చేయటం వల్లే, పిల్లలు ఒత్తిడికే లోనయి, 2 లక్షల మంది ఫెయిల్ అయ్యారు అంటూ, విజయసాయి రెడ్డి చెప్పిన కారణంతో అందరూ అవాక్కయ్యారు. అసలు విజయసాయి రెడ్డికి మైండ్ పని చేస్తుందా లేదా అని కామెంట్లు పెడుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read